PRABHATHA SURYUDU
Newspaper Banner
Date of Publish : 26 July 2026, 9:20 am Posted by : PRABHATHA SURYUDU

Chevella: పట్నం మహేందర్ రెడ్డి తల్లి రుక్కమ్మ కన్నుమూత

మాజీ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి మాతృవియోగం

చేవెళ్ల – ప్రభాత సూర్యుడు: శాసన మండలి ప్రభుత్వ చీఫ్ విప్, మాజీ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి మాతృమూర్తి, రంగారెడ్డి జిల్లా మాజీ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ శ్రీమతి పట్నం సునీతా రెడ్డి అత్తగారు శ్రీమతి పట్నం రుక్కమ్మ (95) శుక్రవారం సాయంత్రం కన్నుమూశారు.

Former Minister Patnam Mahender Reddy's mother Patnam Rukkamma passes away

నిమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస

కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీమతి రుక్కమ్మ హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం 7:45 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆమె మృతి పట్ల కుటుంబ సభ్యులు, బంధువులు, రాజకీయ నాయకులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

శనివారం స్వగ్రామంలో అంత్యక్రియలు

శ్రీమతి పట్నం రుక్కమ్మ అంత్యక్రియలు శనివారం చేవెళ్ల సమీపంలోని షాబాద్ మండలం గొల్లూరుగూడ గ్రామంలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, శ్రేయోభిలాషులు ఆమెకు నివాళులర్పించనున్నారు.

For Related Link : https://www.facebook.com/MahenderReddyPatnam


For Our More News Click Here:https://prabhathasuryudu.com/prahlad-joshi-additional-charge-union-education-ministry/