PRABHATHA SURYUDU
Newspaper Banner
Date of Publish : 18 June 2026, 10:12 pm Posted by : PRABHATHA SURYUDU

Registration Services: మూడు రోజులు రిజిస్ట్రేషన్లు బంద్

హైదరాబాద్ – ప్రభాత సూర్యుడు

రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సేవలను వినియోగించే ప్రజలకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. సర్వర్ నిర్వహణ పనుల దృష్ట్యా ఈ నెల 26 నుంచి 28 వరకు రిజిస్ట్రేషన్ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు వెల్లడించారు. https://registration.telangana.gov.in/

స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించిన వెబ్‌సైట్‌తో పాటు అనుబంధ ఆన్‌లైన్ సేవలు కూడా ఈ మూడు రోజుల పాటు అందుబాటులో ఉండవని తెలిపారు. సుమారు ఐదేళ్ల తర్వాత చేపడుతున్న ఈ సర్వర్ అప్‌గ్రేడ్, నిర్వహణ పనుల ద్వారా సేవల నాణ్యత మరింత మెరుగుపడటంతో పాటు భద్రతా ప్రమాణాలు బలోపేతం అవుతాయని పేర్కొన్నారు.

Registration services temporarily suspended due to server maintenance in Telangana

అయితే జూన్ 26న మొహరమ్, జూన్ 28న ఆదివారం ప్రభుత్వ సెలవు దినాలు కావడంతో మధ్యలో ఉన్న జూన్ 27న మాత్రమే ప్రభుత్వ పని దినంలో సేవలకు అంతరాయం ఏర్పడనుందని స్పష్టం చేశారు. ప్రజలకు అసౌకర్యం తక్కువగా ఉండేలా ఈ షెడ్యూల్‌ను రూపొందించినట్లు తెలిపారు.

ప్రజలు తమ రిజిస్ట్రేషన్ సంబంధిత పనులను ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని, జూన్ 29 నుంచి అన్ని సేవలు యథావిధిగా పునఃప్రారంభమవుతాయని ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు వెల్లడించారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: https://prabhathasuryudu.com/epf-interest-credit-update-central-government-notification/