ePaper
Friday, June 19, 2026
ePaper
HomeజాతీయంEPF Interest: ఈ నెలలోనే ఖాతాల్లో వడ్డీ జమ

EPF Interest: ఈ నెలలోనే ఖాతాల్లో వడ్డీ జమ

📰 Generate e-Paper Clip

న్యూఢిల్లీ – ప్రభాత సూర్యుడు

ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (EPFO) సభ్యులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (EPF) ఖాతాదారులకు 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీ రేటును అధికారికంగా నోటిఫై చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఈపీఎఫ్ చందాదారుల ఖాతాల్లో వడ్డీ జమకు మార్గం సుగమమైంది. కేంద్ర ప్రభుత్వ ఆమోదం అనంతరం ఈపీఎఫ్ ఖాతాల్లో వడ్డీ జమ ప్రక్రియను ఈ నెలలోనే ప్రారంభించనున్నట్లు సమాచారం. https://www.epfo.gov.in/

ఈపీఎఫ్ పథకం కింద ఉద్యోగులు, యాజమాన్యాలు చేసే చందాలపై ప్రతి సంవత్సరం వడ్డీ చెల్లిస్తారు. ఈ వడ్డీ మొత్తం నేరుగా సభ్యుల ఖాతాల్లో జమ అవుతుంది. వడ్డీ జమ అయిన తర్వాత సభ్యులు తమ పాస్‌బుక్ లేదా యూఏఎన్ పోర్టల్ ద్వారా వివరాలు పరిశీలించవచ్చు.

కోట్లాది మంది ఉద్యోగులకు ఈ నిర్ణయం ఆర్థికంగా ఊరటనిచ్చే అంశంగా మారింది. త్వరలోనే వడ్డీ జమకు సంబంధించిన పూర్తి వివరాలను ఈపీఎఫ్‌ఓ ప్రకటించే అవకాశం ఉంది. https://prabhathasuryudu.com/pm-kisan-23rd-installment-funds-release-june-20/

spot_img
RELATED ARTICLES

Most Popular

- Advertisment -spot_img
error: Content is protected !!