ePaper
Monday, August 17, 2026
ePaper
Homeజాతీయంకొమరవెల్లి రైల్వే స్టేషన్‌ను ప్రారంభించిన కిషన్ రెడ్డి

కొమరవెల్లి రైల్వే స్టేషన్‌ను ప్రారంభించిన కిషన్ రెడ్డి

📰 Generate e-Paper Clip

కొమరవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభం

  • సిద్దిపేటకు మరో అభివృద్ధి మైలురాయి
  • స్టేషన్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి

ప్రభాత సూర్యుడు – సిద్దిపేట

సిద్దిపేట జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమరవెల్లిలో నూతనంగా నిర్మించిన కొమరవెల్లి రైల్వే స్టేషన్ను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సిద్దిపేట జిల్లాకు రైల్వే సౌకర్యం కల్పించడం దశాబ్దాలుగా ప్రజల ఆకాంక్షగా ఉందని తెలిపారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం మనోహరాబాద్–కొత్తపల్లి రైల్వే మార్గం పనులను వేగవంతం చేసి, ఈ ప్రాంత ప్రజల కలను సాకారం చేసే దిశగా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. కొమరవెల్లి వంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రానికి రైల్వే స్టేషన్ అందుబాటులోకి రావడం వల్ల భక్తులకు సౌకర్యవంతమైన ప్రయాణం సాధ్యమవుతుందని, స్థానిక ప్రాంత ఆర్థిక, సామాజిక అభివృద్ధికి కూడా ఇది దోహదపడుతుందని మంత్రి అన్నారు.

spot_img
RELATED ARTICLES

Most Popular

- Advertisment -spot_img
error: Content is protected !!