ePaper
Wednesday, July 29, 2026
ePaper
Homeజిల్లా వార్తలుAIYF: అబ్దుల్లాపూర్‌మెట్ మండల కార్యదర్శిగా నిమ్మల గణేష్ ఎన్నిక

AIYF: అబ్దుల్లాపూర్‌మెట్ మండల కార్యదర్శిగా నిమ్మల గణేష్ ఎన్నిక

📰 Generate e-Paper Clip

ఏఐవైఎఫ్ అబ్దుల్లాపూర్‌మెట్ మండల కార్యదర్శిగా నిమ్మల గణేష్ ఎన్నిక

  • యువ సమస్యలపై పోరాటాలకు సిద్ధం కావాలి: నెర్లకంటి శ్రీకాంత్

అబ్దుల్లాపూర్‌మెట్ – ప్రభాత సూర్యుడు:

అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) అబ్దుల్లాపూర్‌మెట్ మండల నూతన కమిటీని ఆదివారం రావి నారాయణరెడ్డి కాలనీలోని సీపీఐ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మండల మహాసభలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి, జిల్లా ఇన్‌చార్జి నెర్లకంటి శ్రీకాంత్ ముఖ్య అతిథిగా హాజరై నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసి మినిట్స్ బుక్ అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల పరిధిలో యువత ఎదుర్కొంటున్న నిరుద్యోగం, విద్య, వైద్యం తదితర సమస్యలపై నిరంతరం ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. అలాగే మండలంలో కొనసాగుతున్న భూ పోరాటాలకు అండగా నిలుస్తూ సీపీఐ పార్టీకి అనుబంధంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు ఆందోజు రవీంద్రచారి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ముత్యాల యాదిరెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు పబ్బతి లక్ష్మణ్, మండల పార్టీ కార్యదర్శి అజ్మీర్ హరిసింగ్ నాయక్, కేతరాజు నర్సింహా తదితరులు పాల్గొన్నారు.

నూతన మండల కమిటీ

  • అధ్యక్షుడు: వంగూరి శోభన్
  • మండల ప్రధాన కార్యదర్శి: నిమ్మల గణేష్
  • కార్యవర్గ సభ్యులు: పోల్మూరి రాజు ప్రవీణ్, సిర్పంగి శ్రీను, చంటి, భాను ప్రకాష్, అశోక్, ఆరావత్ శ్రీను, వినయ్, అంగోత్ సుధాకర్.

నూతన కమిటీ మండలంలోని యువజన సమస్యల పరిష్కారం కోసం చురుకైన పాత్ర పోషించాలని సమావేశంలో నాయకులు ఆకాంక్షించారు.

spot_img
RELATED ARTICLES

Most Popular

- Advertisment -spot_img
error: Content is protected !!