ePaper
Thursday, July 23, 2026
ePaper
Homeజిహెచ్ఎంసిఉప్పల్‌కు సీఎం రేవంత్.. ₹1,511 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

ఉప్పల్‌కు సీఎం రేవంత్.. ₹1,511 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

📰 Generate e-Paper Clip

  • ఉప్పల్‌కు సీఎం రేవంత్.. ₹1,511 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

హైదరాబాద్, ప్రభాత సూర్యుడు:

ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదివారం సాయంత్రం ఉప్పల్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రూ.1,511 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు.

మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్‌కు 10 ఎకరాల విస్తీర్ణంలో రూ.98 కోట్ల వ్యయంతో నిర్మించనున్న నూతన కార్పొరేషన్ భవనానికి సీఎం శంకుస్థాపన చేయనున్నారు.

అదేవిధంగా రూ.960 కోట్లతో ఏఓసీ సెంటర్ పరిధిలో ప్రత్యామ్నాయ రహదారుల నిర్మాణ పనులకు, రూ.416 కోట్లతో టీకేఆర్ కాలేజ్ జంక్షన్ వద్ద 6 లేన్ల ఫ్లైఓవర్ నిర్మాణానికి కూడా శ్రీకారం చుట్టనున్నారు.

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రూ.37.50 కోట్ల వ్యయంతో 100 పడకల మల్కాజిగిరి జిల్లా ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.

అలాగే ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించే లక్ష్యంతో రూపొందించిన “క్యూర్ వన్” (CURE One) యాప్ ను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు.

spot_img
RELATED ARTICLES

Most Popular

- Advertisment -spot_img
error: Content is protected !!