ePaper
Monday, August 17, 2026
ePaper
Homeజిల్లా వార్తలునల్గొండ డీఈఓగా సుశిందర్ రావు.. భిక్షపతికి యాదాద్రి బదిలీ

నల్గొండ డీఈఓగా సుశిందర్ రావు.. భిక్షపతికి యాదాద్రి బదిలీ

📰 Generate e-Paper Clip

నల్గొండ డీఈఓగా సుశిందర్ రావు.. భిక్షపతికి యాదాద్రి బదిలీ

నల్గొండ, ప్రభాత సూర్యుడు

రాష్ట్ర విద్యాశాఖలో చేపట్టిన తాజా బదిలీల్లో భాగంగా నల్గొండ జిల్లా నూతన విద్యాశాఖాధికారిగా (డీఈఓ) సి. సుశిందర్ రావును ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఆయన రంగారెడ్డి జిల్లా డీఈఓగా విధులు నిర్వహిస్తున్నారు.

అదే సమయంలో నల్గొండ జిల్లా డీఈఓగా విధులు నిర్వహిస్తున్న బొల్లారం భిక్షపతిని యాదాద్రి భువనగిరి జిల్లాకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

పరిపాలనా అవసరాల దృష్ట్యా చేపట్టిన ఈ బదిలీలతో నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల విద్యాశాఖ పరిపాలనలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ అధికారిక ఉత్తర్వులు విడుదల చేసింది.

spot_img
RELATED ARTICLES

Most Popular

- Advertisment -spot_img
error: Content is protected !!