ePaper
Sunday, September 6, 2026
ePaper
Homeజిహెచ్ఎంసినాగోల్ సర్కిల్ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

నాగోల్ సర్కిల్ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

📰 Generate e-Paper Clip

పెద్ద అంబర్‌పేట్ – ప్రభాత సూర్యుడు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నాగోల్ సర్కిల్ కార్యాలయంలో మంగళవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాగోల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఏ. సంపత్ జాతీయ జెండాను ఆవిష్కరించి అధికారులకు, సిబ్బందికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ప్రతి ఉద్యోగి అంకితభావంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం రాష్ట్ర సాధన కోసం పోరాడిన అమరుల త్యాగాలను స్మరించుకుంటూ వారికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఏయంసిలు కిరణ్ కుమార్, నర్సింహులు, హరి కుమార్, సాయిక్రిష్ణ, రమాదేవి మరియూ వార్డు అధికారులు, కార్యాలయ సిబ్బంది, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు.

spot_img
RELATED ARTICLES

Most Popular

- Advertisment -spot_img
error: Content is protected !!