ePaper
Thursday, November 5, 2026
ePaper
HomeతెలంగాణTelangana Rythu Bharosa Fact Check : రైతు భరోసా నిధుల జమపై వైరల్ మెసేజ్‌లు...

Telangana Rythu Bharosa Fact Check : రైతు భరోసా నిధుల జమపై వైరల్ మెసేజ్‌లు అవాస్తవం

📰 Generate e-Paper Clip

రైతు భరోసా నిధుల జమపై వైరల్ మెసేజ్‌లు అవాస్తవం

రైతుల ఖాతాల్లో డబ్బులు జమయ్యాయంటూ తప్పుడు ప్రచారం

అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని వ్యవసాయ శాఖ హెచ్చరిక

హైదరాబాద్ – ప్రభాత సూర్యుడు:

తెలంగాణలో రైతు భరోసా నిధులు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యాయంటూ సామాజిక మాధ్యమాల్లో, మెసేజ్‌ల రూపంలో ప్రచారం జరుగుతున్న సమాచారం పూర్తిగా అవాస్తవమని రాష్ట్ర వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది. నవంబర్ 4వ తేదీ ఉదయం కొన్ని జిల్లాల్లోని రైతులకు ఈ తరహా సందేశాలు వచ్చినట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపింది. అయితే, ఈ సందేశాలకు ఎలాంటి అధికారిక ఆధారం లేదని, అవి నిజమైనవి కావని వెల్లడించింది.

Telangana Agriculture Department Fact Check on Fake Rythu Bharosa Fund Deposit Messages

C-DAC, NIC సంస్థలతో పరిశీలన

వైరల్ అవుతున్న సందేశాలపై వ్యవసాయ శాఖ సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (C-DAC), నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (NIC) సంస్థలతో సంప్రదింపులు జరిపింది. పరిశీలన అనంతరం ఈ సందేశాలు మోసపూరితమైనవని నిర్ధారించినట్లు వ్యవసాయ శాఖ పేర్కొంది. రైతు భరోసా నిధులు జమ అయ్యాయంటూ తప్పుడు సమాచారాన్ని పంపిస్తున్న వ్యక్తులు లేదా సంస్థల వివరాలను గుర్తించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపింది. ఈ వ్యవహారంపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు, సందేశాల వెనుక ఉన్నవారిని గుర్తించి తగిన విచారణ చేపట్టాలని కోరినట్లు వెల్లడించింది.

రైతులకు వ్యవసాయ శాఖ సూచనలు

అనుమానాస్పద సందేశాల్లో వచ్చే లింకులను రైతులు క్లిక్ చేయవద్దని వ్యవసాయ శాఖ హెచ్చరించింది. బ్యాంకు ఖాతా వివరాలు, వ్యక్తిగత సమాచారం, ఓటీపీ వంటి సున్నితమైన సమాచారాన్ని ఎవరికీ వెల్లడించవద్దని సూచించింది. ప్రభుత్వ పథకాల నిధుల జమకు సంబంధించిన సమాచారాన్ని అధికారిక ప్రభుత్వ ప్రకటనలు, సంబంధిత శాఖల ద్వారా మాత్రమే ధృవీకరించుకోవాలని పేర్కొంది. రైతు భరోసా పథకం పేరుతో మోసాలకు పాల్పడే ప్రయత్నాల పట్ల అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ సూచించింది. తప్పుడు సందేశాలను ఇతరులకు పంపకుండా, వాటి నిజానిజాలను పరిశీలించిన తర్వాతే స్పందించాలని రైతులకు విజ్ఞప్తి చేసింది.

For Related Link :https://agri.telangana.gov.in/

For Our More News Click Here :https://prabhathasuryudu.com/telangana-sir-deadline-extended-november-26/

spot_img
RELATED ARTICLES

Most Popular

- Advertisment -spot_img
error: Content is protected !!