ePaper
Monday, September 28, 2026
ePaper
Homeక్రీడలుకరేబియన్లపై టీమిండియా ఘన విజయం

కరేబియన్లపై టీమిండియా ఘన విజయం

📰 Generate e-Paper Clip

భారత పర్యటనలో ఉన్న వెస్టిండీస్ జట్టు తమ పేలవ ప్రదర్శనను కొనసాగిస్తోంది. టీమిండియాతో ఆదివారం జరిగిన తొలి వన్డేలో కరేబియన్ జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత యాభై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది. ఓపెనర్లు శుభారంభం అందించినప్పటికీ, దానిని సద్వినియోగం చేసుకోవడంలో మిడిలార్డర్ బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. అనంతరం 296 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా కేవలం 41.4 ఓవర్లలోనే రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. కరేబియన్ బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోవడంతో భారత బ్యాటర్లు చెలరేగి ఆడి జట్టుకు ఘన విజయాన్ని అందించారు.

ఈ ఘోర పరాజయంపై విండీస్ కెప్టెన్ షాయీ హోప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. మ్యాచ్ అనంతరం ఆయన మాట్లాడుతూ.. తమ ఓటమికి గల కారణాలను విశ్లేషించాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో వైఫల్యమే తమ కొంపముంచిందన్నాడు. “మేము కచ్చితంగా కాస్త భిన్నంగా ఆడి ఉండాల్సింది. బోర్డుపై మరిన్ని పరుగులు ఉండి ఉంటే ఫలితం వేరేలా ఉండేది. సాధారణంగా భారత్‌లోని పిచ్‌లు బ్యాటింగ్‌కు ఎంతో అనుకూలంగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనం ఎన్ని ఎక్కువ పరుగులు సాధిస్తే విజయావకాశాలు అంత మెరుగ్గా ఉంటాయి. వాస్తవానికి ఈ మ్యాచ్‌లో మేము కనీసం 60 నుంచి 80 పరుగుల మేర వెనుకబడిపోయాము” అని హోప్ అభిప్రాయపడ్డాడు.

అలాగే బౌలర్ల తీరుపై కూడా షాయీ హోప్ అసహనం వ్యక్తం చేశాడు. 290 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోవాలంటే బౌలర్లు అద్భుతంగా రాణించాల్సి ఉంటుందని, కానీ తమ వాళ్లు ఆ స్థాయిలో సత్తా చాటలేకపోయారన్నాడు. ఆరంభంలో బౌలర్లు కాస్త మెరుగ్గానే బౌలింగ్ చేసినప్పటికీ.. మధ్య ఓవర్లలో దారాళంగా పరుగులు సమర్పించుకున్నారని, ఓవర్‌కు ఏడు కంటే ఎక్కువ పరుగులు ఇవ్వడం మ్యాచ్‌ ఫలితంపై తీవ్ర ప్రభావం చూపిందని షాయీ హోప్ ఆవేదన వ్యక్తం చేశాడు.

spot_img
RELATED ARTICLES

Most Popular

- Advertisment -spot_img
error: Content is protected !!