ePaper
Tuesday, August 25, 2026
ePaper
Homeజిహెచ్ఎంసిబడంగ్‌పేట్ సర్కిల్లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

బడంగ్‌పేట్ సర్కిల్లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

📰 Generate e-Paper Clip

బడంగ్‌పేట్ – ప్రభాత సూర్యుడు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జీహెచ్‌ఎంసీ బడంగ్‌పేట్ సర్కిల్ కార్యాలయ ఆవరణలో మంగళవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ వి. సమ్మయ్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి తెలంగాణ ఉద్యమ అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సమ్మయ్య మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల సేవలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలులో ప్రభుత్వ ఉద్యోగులు కీలక పాత్ర పోషించాలని, ముఖ్యంగా ఎస్‌ఐఆర్ (SIR), జనగణన (Census) వంటి కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌ఆర్‌వో రాఘవేంద్ర, ఏఎంఓహెచ్ ప్రవీణ్ కుమార్, డీఈ అభినయ్ కుమార్, ఏఈ హరీష్, ఏఈ గంగాప్రసాద్, ఏఎంసీ స్వప్న, సీనియర్ అసిస్టెంట్లు, వార్డు అధికారులు, కార్యాలయ సిబ్బంది, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

spot_img
RELATED ARTICLES

Most Popular

- Advertisment -spot_img
error: Content is protected !!