ePaper
Monday, June 15, 2026
ePaper
Homeజాతీయంఢిల్లీలో మెరిసిన నల్లగొండ ప్రతిభ

ఢిల్లీలో మెరిసిన నల్లగొండ ప్రతిభ

📰 Generate e-Paper Clip

  • ఒకే వేదికపై ఇద్దరు తెలుగువారికి గౌరవ డాక్టరేట్లు
  • ఉమ్మడి నల్లగొండ జిల్లాకు జాతీయ గౌరవం

హైదరాబాద్ – ప్రభాత సూర్యుడు

దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన ప్రముఖులను సత్కరిస్తూ మ్యాజిక్ బుక్ ఆఫ్ రికార్డ్స్, మ్యాజిక్ అండ్ ఆర్ట్స్ యూనివర్సిటీ సంయుక్తంగా ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఇద్దరు ప్రతిభావంతులు గౌరవ డాక్టరేట్లు అందుకున్నారు. చిట్యాల మండలం వెలిమినేడు గ్రామానికి చెందిన ఐటీ రంగ ప్రముఖుడు అంతటి చాణిక్య మధు కిరణ్ గౌడ్ ఐటీ సేవలలో చేసిన కృషికి గాను గౌరవ డాక్టరేట్ అందుకోగా, యాదాద్రి భువనగిరి జిల్లా నిదానపల్లి గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్టు, సామాజిక సేవకుడు, ‘స్థానికం’ పత్రిక వ్యవస్థాపకుడు కొండ మల్లేశం గౌడ్ సామాజిక సేవ, జర్నలిజం రంగాల్లో చేసిన విశేష సేవలకు గాను గౌరవ డాక్టరేట్‌తో సత్కరించబడ్డారు. https://magicbookofrecord.com/

డాక్టరేట్ ను అందుకుంటున్న చాణిక్య మధు కిరణ్ గౌడ్

దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 73 మంది విశిష్ట వ్యక్తులకు ఈ పురస్కారాలు ప్రదానం చేయగా, తెలంగాణ రాష్ట్రం నుంచి ఆరుగురు ఎంపికయ్యారు. వారిలో ఇద్దరు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందినవారు కావడం విశేషం. ఈ సందర్భంగా డాక్టర్ చాణిక్య మధు కిరణ్ గౌడ్ తన విజయానికి తల్లిదండ్రులు అంతటి ఆదిమల్లేష్ గౌడ్, లలితల ప్రోత్సాహమే కారణమని పేర్కొంటూ ఈ గౌరవాన్ని వారికి అంకితం చేశారు. లారీ క్లీనర్‌గా జీవితాన్ని ప్రారంభించి జర్నలిస్టుగా, సామాజిక సేవకుడిగా ఎదిగిన డాక్టర్ కొండ మల్లేశం గౌడ్ తెలంగాణ ఉద్యమం, విద్యా సేవలు, ఉపాధి కల్పన కార్యక్రమాల ద్వారా సమాజానికి విశేష సేవలందించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఒకే వేదికపై గౌరవ డాక్టరేట్లు అందుకోవడం జిల్లాకు గర్వకారణమని పలువురు ప్రజాప్రతినిధులు, సామాజికవేత్తలు, జర్నలిస్టులు అభినందించారు.

డాక్టరేట్ ను అందుకుంటున్న కొండ మల్లేశం గౌడ్

https://prabhathasuryudu.com/eco-town-protest-abdullapurmet-villagers-demand-cancel-go-20/

spot_img
RELATED ARTICLES

Most Popular

- Advertisment -spot_img
error: Content is protected !!