ePaper
Thursday, November 5, 2026
ePaper
Homeఆధ్యాత్మికంTTD News : శ్రీనివాసమంగాపురంలో పవిత్రోత్సవాలకు అంకురార్పణ

TTD News : శ్రీనివాసమంగాపురంలో పవిత్రోత్సవాలకు అంకురార్పణ

📰 Generate e-Paper Clip

శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

నవంబర్ 5 నుంచి 7 వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు

నవంబర్ 6న స్వామివారు, అమ్మవార్ల వీధి ఉత్సవం

తిరుపతి – ప్రభాత సూర్యుడు:

శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న పవిత్రోత్సవాలకు బుధవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. నవంబర్ 5 నుంచి 7వ తేదీ వరకు జరగనున్న ఈ ఉత్సవాలకు ముందుగా మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం నిర్వహించారు. పవిత్రోత్సవాల్లో భాగంగా వేదపఠనం, ఆలయశుద్ధి, పుణ్యాహవచనం వంటి వైదిక కార్యక్రమాలు చేపట్టనున్నారు.

మూడు రోజుల పవిత్రోత్సవాల కార్యక్రమాలు

పవిత్రోత్సవాల్లో మొదటి రోజైన నవంబర్ 5వ తేదీ ఉదయం 8.30 గంటలకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అదే రోజు రాత్రి 7 గంటలకు పవిత్ర ప్రతిష్ఠ చేపడతారు. రెండో రోజైన నవంబర్ 6వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు పవిత్ర సమర్పణ కార్యక్రమం నిర్వహిస్తారు. చివరి రోజైన నవంబర్ 7వ తేదీ రాత్రి 8.30 గంటలకు పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి.

స్నపన తిరుమంజనం, వీధి ఉత్సవం

పవిత్రోత్సవాల్లో భాగంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు. నవంబర్ 5, 7వ తేదీలలో ఉదయం 11 గంటలకు, నవంబర్ 6వ తేదీన ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. నవంబర్ 6వ తేదీ సాయంత్రం 5 గంటలకు స్వామివారు, అమ్మవార్ల వీధి ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఆర్జిత సేవలో గృహస్తులకు అవకాశం

పవిత్రోత్సవాల ఆర్జిత సేవలో ఇద్దరు గృహస్తులు రూ.516 చెల్లించి ఒకరోజు పాల్గొనే అవకాశం కల్పించారు. సేవలో పాల్గొనే గృహస్తులకు ఒక పవిత్రమాల, ఒక ఉత్తరీయం, ఒక రవికెతో పాటు అన్నప్రసాదం బహుమానంగా అందజేయనున్నారు. పవిత్రోత్సవాల నిర్వహణ నేపథ్యంలో నవంబర్ 5వ తేదీన తిరుప్పావడ సేవను, నవంబర్ 5 నుంచి 7వ తేదీ వరకు ఆర్జిత కల్యాణోత్సవ సేవను టీటీడీ రద్దు చేసింది. అంకురార్పణ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో శ్రీ గోపినాథ్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ ధనశేఖర్‌తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

For Related Link :https://ttdevasthanams.ap.gov.in/home/dashboard

For Our More News Click Here :https://prabhathasuryudu.com/ttd-specified-authority-committee-appointment/

spot_img
RELATED ARTICLES

Most Popular

- Advertisment -spot_img
error: Content is protected !!