ePaper
Sunday, November 22, 2026
ePaper
HomeCrimeACB Raid Karimnagar : రూ.10 వేల లంచం తీసుకుంటూ పట్టుబడిన పంచాయతీ కార్యదర్శి

ACB Raid Karimnagar : రూ.10 వేల లంచం తీసుకుంటూ పట్టుబడిన పంచాయతీ కార్యదర్శి

📰 Generate e-Paper Clip

రూ.10 వేల లంచం తీసుకుంటూ పట్టుబడిన పంచాయతీ కార్యదర్శి

వితంతు పింఛన్ మంజూరు కోసం లంచం డిమాండ్

రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు

కరీంనగర్ – ప్రభాత సూర్యుడు:

వితంతు పింఛన్ మంజూరు చేసేందుకు లంచం డిమాండ్ చేసిన పంచాయతీ కార్యదర్శిని తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కరీంనగర్ జిల్లా లక్ష్మీపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి లావుడ్య చవాన్ లాల్ రూ.10 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు చిక్కారు.

ఫిర్యాదుదారుడి కోడలికి వితంతు పింఛన్ మంజూరు చేయించేందుకు పంచాయతీ కార్యదర్శి లంచం డిమాండ్ చేసినట్లు ఫిర్యాదు అందింది. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పంచాయతీ కార్యదర్శి లావుడ్య చవాన్ లాల్ లంచం తీసుకుంటున్న సమయంలో దాడి చేసి పట్టుకున్నారు. ఆయన వద్ద నుంచి లంచం సొమ్ము రూ.10 వేలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది.

spot_img
RELATED ARTICLES

Most Popular

- Advertisment -spot_img
error: Content is protected !!