ePaper
Wednesday, October 7, 2026
ePaper
Homeక్రైమ్ఏసీబీ వలలో రంగారెడ్డి డీఎంహెచ్‌ఓ డా. స్వర్ణ కుమారి

ఏసీబీ వలలో రంగారెడ్డి డీఎంహెచ్‌ఓ డా. స్వర్ణ కుమారి

📰 Generate e-Paper Clip

ఏసీబీ వలలో రంగారెడ్డి డీఎంహెచ్‌ఓ

లైసెన్స్ కోసం రూ.2 లక్షలు డిమాండ్

రూ.లక్ష లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ స్వర్ణకుమారి

రంగారెడ్డి – ప్రభాత సూర్యుడు: రంగారెడ్డి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో లంచాల వ్యవహారం బట్టబయలైంది. రూ.లక్ష లంచం తీసుకుంటూ జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ (డీఎంహెచ్‌ఓ) స్వర్ణకుమారి ఏసీబీ అధికారుల వలలో రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు. ఏసిబి అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్బీనగర్‌లో ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఒక ఫిజియోథెరపీ కేంద్రాన్ని గతంలో అధికారులు సీజ్ తాళాలు స్వాదీనం చేసుకున్నారు. తిరిగి ఫిజియోథెరపీ కేంద్రం తాళాలు తిరిగి ఇవ్వడంతోపాటు, తదుపరి చర్యలు తీసుకోకుండా ఉండేందుకు,  కొత్త లైసెన్స్ జారీ చేసేందుకు డీఎంహెచ్‌ఓ రూ.2 లక్షలు లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా.. ఏసిబి అధికారులు పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగిన లంచం తీసుకుంటున్న సమయంలో డీఎంహెచ్‌ఓను పట్టుకున్నారు.

మొదటి విడతగా బాధితుడు ఇచ్చిన రూ.లక్షను డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో విధులు నిర్వహస్తున్న హెల్త్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్‌కు ఇవ్వగా, ఆయన ఆ మొత్తాన్ని డీఎంహెచ్‌ఓ స్వర్ణకుమారి కార్ డ్రైవర్ మద్దూరి క్రిష్ణయ్యకు ఇచ్చే క్రమంలో ఆ డబ్బులను తీసుకుని కారులో పెట్టేందుకు వెళ్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ప్రస్తుతం డీఎంహెచ్‌ఓ స్వర్ణకుమారి, హెల్త్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, డ్రైవర్ కృష్ణయ్య తదితరులపై ఏసీబీ అధికారులు విచారణ కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

spot_img
RELATED ARTICLES

Most Popular

- Advertisment -spot_img
error: Content is protected !!