ePaper
Sunday, August 2, 2026
ePaper
Homeఅంతర్జాతీయంప్రపంచ తొలి ట్రిలియనీర్‌గా ఎలాన్ మస్క్.. స్పేస్‌ఎక్స్ IPOతో కొత్త చరిత్ర

ప్రపంచ తొలి ట్రిలియనీర్‌గా ఎలాన్ మస్క్.. స్పేస్‌ఎక్స్ IPOతో కొత్త చరిత్ర

📰 Generate e-Paper Clip

న్యూయార్క్, ప్రభాత సూర్యుడు

టెస్లా, స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా అవతరించి చరిత్ర సృష్టించారు. స్పేస్‌ఎక్స్ సంస్థ షేర్లు అమెరికా స్టాక్ మార్కెట్లో ఘనంగా లిస్టింగ్ కావడంతో ఆయన సంపద 1 ట్రిలియన్ డాలర్ల మార్క్‌ను దాటింది. పలు అంతర్జాతీయ మీడియా సంస్థల అంచనాల ప్రకారం ప్రస్తుతం మస్క్ నికర సంపద సుమారు 1.1 ట్రిలియన్ డాలర్లు (దాదాపు రూ.95 లక్షల కోట్లు) చేరుకుంది.

స్పేస్‌ఎక్స్ IPOలో షేర్ ధర 135 డాలర్లుగా నిర్ణయించగా, ట్రేడింగ్ ప్రారంభమైన తర్వాత 150 డాలర్ల వద్ద లిస్టింగ్ అయింది. అనంతరం షేర్ మరింత ఎగసిపడటంతో కంపెనీ మార్కెట్ విలువ 2 ట్రిలియన్ డాలర్లకు పైగా చేరింది. స్పేస్‌ఎక్స్‌లో ఎలాన్ మస్క్‌కు ఉన్న భారీ వాటా, టెస్లా సహా ఇతర కంపెనీల్లో ఆయన పెట్టుబడులు కలిసి ఆయనను ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా నిలబెట్టాయి. ఈ ఘనతతో మస్క్ మరోసారి ప్రపంచ వ్యాపార, సాంకేతిక రంగాల్లో తన ఆధిపత్యాన్ని చాటుకున్నారు.

spot_img
RELATED ARTICLES

Most Popular

- Advertisment -spot_img
error: Content is protected !!