ePaper
Wednesday, July 22, 2026
ePaper
Homeతెలంగాణతెలంగాణలో రెండ్రోజులు భారీ వర్షాలు

తెలంగాణలో రెండ్రోజులు భారీ వర్షాలు

📰 Generate e-Paper Clip

18 జిల్లాలకు హెచ్చరికలు, పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

హైదరాబాద్, ప్రభాత సూర్యుడు

తెలంగాణ రాష్ట్రంలో బుధ, గురువారాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. రాష్ట్రంలోని 18 జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాల నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా, మిగిలిన పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

https://whatsapp.com/channel/0029VbBg73K3LdQZlPXIQJ0a

ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని, చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో ఆశ్రయం పొందవద్దని సూచించారు. రైతులు పంటల రక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు. వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

spot_img
RELATED ARTICLES

Most Popular

- Advertisment -spot_img
error: Content is protected !!