ఆగస్టు 10న వరుణ యాగం నిర్వహించనున్న తెలంగాణ ప్రభుత్వం
హైదరాబాద్ – ప్రభాత సూర్యుడు:
రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసి, జలాశయాలు, చెరువులు నిండాలని ఆకాంక్షిస్తూ ఆగస్టు 10న వరుణ యాగం నిర్వహించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు యాదగిరిగుట్ట దేవస్థానం అర్చకులు, వేద పండితులు, సిద్ధాంతులు ముహూర్తాన్ని నిర్ణయించారు.
నాగార్జునసాగర్‌లో యాగం నిర్వహణ
వరుణ యాగాన్ని నాగార్జునసాగర్ డ్యామ్ తీరంలోని విజయవిహార్ ప్రాంగణంలో నిర్వహించనున్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట దేవస్థానం అర్చకులు, వేద పండితులు శాస్త్రోక్తంగా యాగ క్రతువులను నిర్వహించనున్నారు.
వర్షాలు సమృద్ధిగా కురవాలని ప్రత్యేక పూజలు
కృష్ణా, గోదావరి నదులు, రాష్ట్రంలోని చెరువులు జలకళ సంతరించుకోవాలని, రైతులకు పాడిపంటలు సమృద్ధిగా పండాలని సంకల్పంతో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది.
సాయంత్రం జరిగే మహా పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఈ విషయాన్ని యాదగిరిగుట్ట దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ ఎంఎస్‌ఎన్ రెడ్డి ప్రకటించారు.
For Related Link :
For Our More News Click Here:

