ePaper
Monday, August 10, 2026
ePaper
Homeజిహెచ్ఎంసిమున్సిపల్ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే అక్రమ నిర్మాణం !

మున్సిపల్ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే అక్రమ నిర్మాణం !

📰 Generate e-Paper Clip

– భారీ షెడ్ నిర్మాణంపై స్థానికుల ఆగ్రహం

– ఫంక్షన్ హాల్ పన్ను వ్యవహారంపై కూడా అనుమానాలు

పెద్ద అంబర్‌పేట్, జూన్ 23 (ప్రభాత సూర్యుడు):

మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ నాగోల్ సర్కిల్ పరిధిలోని పెద్ద అంబర్‌పేట్ డివిజన్‌లో అక్రమ నిర్మాణాల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. కళ్ళెం బాల్‌రెడ్డి ఫంక్షన్ హాల్ ఆవరణలో మున్సిపల్ అనుమతులు లేకుండానే భారీ షెడ్ నిర్మాణం చేపడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రత్యేకంగా ఈ నిర్మాణం నాగోల్ సర్కిల్ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే జరుగుతున్నప్పటికీ టౌన్ ప్లానింగ్ అధికారులకు కనిపించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని స్థానికులు విమర్శిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణ పనులు జరుగుతున్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, సంబంధిత ఫంక్షన్ హాల్ ప్రాపర్టీ ట్యాక్స్ వ్యవహారంలో కూడా అక్రమాలు జరిగాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసెస్‌మెంట్ ప్రక్రియ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించబడిందని, ఫలితంగా మున్సిపాలిటీకి రావాల్సిన ఆదాయానికి గండి పడుతోందని స్థానిక నాయకులు పేర్కొంటున్నారు. ఫంక్షన్ హాల్‌కు తక్షణమే రీ-అసెస్‌మెంట్ నిర్వహించి వాస్తవ పన్ను బకాయిలను నిర్ధారించాలని, అనుమతులు లేకుండా చేపడుతున్న నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు, నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మున్సిపల్ ఆదాయాన్ని కాపాడటంతో పాటు అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు స్పందించి విచారణ జరిపి చర్యలు తీసుకుంటారా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది.

spot_img
RELATED ARTICLES

Most Popular

- Advertisment -spot_img
error: Content is protected !!