ePaper
Wednesday, June 10, 2026
ePaper
HomeజాతియంMeenakshi Natarajan కు భారీ షాక్

Meenakshi Natarajan కు భారీ షాక్

📰 Generate e-Paper Clip

మీనాక్షి నటరాజన్‌కు భారీ షాక్.. రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ

తెలంగాణ కేసు వివరాలు వెల్లడించలేదంటూ అభ్యంతరం దీంతో బీజేపీ ఫిర్యాదుతో చర్య

భోపాల్/న్యూఢిల్లీ, ప్రభాత సూర్యుడు:

కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకురాలు, తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎన్నికల బరిలో నిలిచిన ఆమె నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు.

https://www.eci.gov.in/

నామినేషన్ అఫిడవిట్‌లో తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించలేదంటూ బీజేపీ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేసింది. అయితే ఈ అభ్యంతరాన్ని పరిశీలించిన ఎన్నికల అధికారులు నామినేషన్‌ను తిరస్కరించినట్లు సమాచారం. మధ్యప్రదేశ్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మీనాక్షి నటరాజన్‌ను పార్టీ అధిష్ఠానం బరిలోకి దింపింది. అయితే ఆమె అఫిడవిట్‌లో తెలంగాణ కోర్టులో పెండింగ్‌లో ఉన్న వ్యవహారాన్ని ప్రస్తావించలేదని బీజేపీ ఆరోపించింది.

ఇదిలా ఉండగా, కాంగ్రెస్ పార్టీ స్పందిస్తూ ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. మీనాక్షి నటరాజన్‌పై ఎలాంటి క్రిమినల్ కేసు నమోదు కాలేదని, కేవలం ఒక నోటీసు మాత్రమే జారీ అయిందని, అలాంటి అంశాన్ని అఫిడవిట్‌లో పేర్కొనాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నారు. నామినేషన్ తిరస్కరణతో మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

For More Updates Click https://prabhathasuryudu.com/acb-raids-on-rb-enc-mohan-naik-assets-in-hyderabad/#google_vignette

spot_img
RELATED ARTICLES

Most Popular

- Advertisment -spot_img
error: Content is protected !!