ePaper
Friday, October 2, 2026
ePaper
HomeజాతీయంFighter Smith Machchanరియల్ | హీరో పైలట్ స్మిత్ మచ్చార్‌కు ‘విశిష్ట గుజరాత్ గరిమా అవార్డు’

Fighter Smith Machchanరియల్ | హీరో పైలట్ స్మిత్ మచ్చార్‌కు ‘విశిష్ట గుజరాత్ గరిమా అవార్డు’

📰 Generate e-Paper Clip

గాంధీనగర్: విధి నిర్వహణలో ప్రాణాలకు తెగించి 174 మంది ప్రయాణికులను సురక్షితంగా కాపాడిన ఫ్లైదుబాయ్ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చార్‌ను అరుదైన గౌరవం వరించింది. ఆయన అసాధారణ ధైర్యసాహసాలకు గుర్తింపుగా గుజరాత్ ప్రభుత్వం ఆయనకు ప్రతిష్ఠాత్మక ‘విశిష్ట గుజరాత్ గరిమా అవార్డు’ (Vishisht Gujarat Garima Award) ను ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అధికారికంగా వెల్లడించారు.

ఇటీవల దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ నగరానికి బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానంలో అనూహ్య ఘటన (Flydubai flight incident) చోటుచేసుకుంది. విమానం గాల్లో ఉండగా కాక్‌పిట్‌లో సహ పైలట్‌తో జరిగిన ఊహించని ఘర్షణలో కెప్టెన్ స్మిత్ మచ్చార్ తీవ్రంగా గాయపడ్డారు. రక్తమోడుతున్నప్పటికీ ఏమాత్రం సంయమనం కోల్పోకుండా, విమానంలోని 174 మంది ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా ఆయన వీరోచితంగా వ్యవహరించారు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో విమానాన్ని సౌదీ అరేబియాలోని తబుక్ విమానాశ్రయానికి మళ్లించి, ఎమర్జెన్సీ ల్యాండింగ్ (Emergency Landing) చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పి ప్రయాణికులంతా సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు.

ప్రధాని మోదీ ప్రశంసలు.. సోమనాథ్ ఆలయంలో పూజలు

ప్రస్తుతం స్మిత్ మచ్చార్ సౌదీ అరేబియాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గాయపడినా వెనక్కితగ్గకుండా వందల మంది ప్రాణాలు కాపాడిన ఆయనపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖ నేతలు ఆయన ధైర్యాన్ని కొనియాడారు. స్మిత్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ గుజరాత్‌లోని ప్రముఖ సోమనాథ్ ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు సైతం నిర్వహించారు.

spot_img
RELATED ARTICLES

Most Popular

- Advertisment -spot_img
error: Content is protected !!