ePaper
Sunday, October 4, 2026
ePaper
Homeసినిమాప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత

ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత

📰 Generate e-Paper Clip

ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత

చెన్నై – ప్రభాత సూర్యుడు:

ప్రముఖ సినీ దర్శకుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి సింగీతం శ్రీనివాసరావు కన్నుమూశారు. చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో వయోభారంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. ఆయన మృతితో తెలుగు, తమిళ, కన్నడ సినీ పరిశ్రమల్లో విషాదం నెలకొంది సింగీతం శ్రీనివాసరావు తెలుగు సినిమాతో పాటు దక్షిణ భారతీయ చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు. విభిన్న కథాంశాలు, ప్రయోగాత్మక చిత్రాలు, కొత్త తరహా కథనాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. దర్శకుడిగా దాదాపు ఆరు దశాబ్దాల పాటు సినీ రంగంలో సేవలందించారు.

సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ‘పుష్పక విమానం’, ‘ఆదిత్య 369’, ‘భైరవద్వీపం’, ‘మయూరి’, ‘సొమ్మొకడిది సోకొకడిది’ తదితర చిత్రాలు విశేష గుర్తింపు పొందాయి. ముఖ్యంగా ‘పుష్పక విమానం’ సంభాషణలు లేకుండా రూపొందించిన ప్రయోగాత్మక చిత్రంగా భారతీయ సినీ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ తదితర భాషల్లో ఆయన సినిమాలు రూపొందించారు. దర్శకుడిగానే కాకుండా రచయిత, నిర్మాత, నటుడు, సంగీతకర్తగా కూడా సినీ రంగానికి సేవలందించారు. ఆయన చిత్రాలకు జాతీయ, రాష్ట్ర స్థాయిలో పలు అవార్డులు లభించాయి.

సింగీతం శ్రీనివాసరావు మృతి సినీ రంగానికి తీరని లోటుగా పలువురు సినీ ప్రముఖులు పేర్కొంటున్నారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన విభిన్న చిత్రాలు, ప్రయోగాత్మక సినిమా పట్ల ఆయన చూపిన ఆసక్తి ఎప్పటికీ గుర్తుండిపోతుందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.

spot_img
RELATED ARTICLES

Most Popular

- Advertisment -spot_img
error: Content is protected !!