కొడాలి నానిని చుట్టుముడుతున్న కేసులు

కొడాలి నానిని చుట్టుముడుతున్న కేసులు

On
కొడాలి నానిని చుట్టుముడుతున్న కేసులు


విజయవాడ - ప్రభాత సూర్యుడు
కొడాలి నాని. తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని ఈ నేత కాంట్రవర్సీలకు కేరాఫ్‌. వైపీపీ హయాంలో చంద్రబాబు, లోకేశ్‌ను అడ్డగోలుగా బూతులు తిట్టారని..వాళ్ల కుటుంబ సభ్యుల విూద కూడా అడ్డగోలుగా మాట్లాడారని నాని విూద టీడీపీ క్యాడర్‌ ఆగ్రహంతో ఉంది. ఈ నేపథ్యంలో ఆ మధ్య విశాఖలో కొడాలి విూద ఓ యువతి కంప్లైంట్‌ చేశారు. ఆ తర్వాత కూడా అక్కడక్కడ కేసులు నమోదయ్యాయి. అదే ఊపులో కొడాలి నానిని కూడా అరెస్ట్‌ చేస్తారన్న ప్రచారం జరిగింది. ఈలోపే గుడివాడలో జగనన్న కాలనీ స్థలాల స్టోరీ వెలుగులోకి వచ్చింది.జగనన్న కాలనీల కోసం గుడివాడలో సేకరించిన భూములపై కేసు నమోదైనట్లు తెలుస్తోంది. పేదలకు ఇండ్ల స్థలాలు ఇచ్చేందుకు 173 ఎకరాలు సేకరించి..మెరక పేరుతో అనుచరులకు వర్క్‌ ఆర్డర్స్‌ ఇచ్చారని నాని విూద ఆరోపణలు ఉన్నాయి. అలా తనకు కావాల్సిన వాళ్లకు పనులు అప్పగించి 8కోట్ల రూపాయలతో పనులు చేపట్టి.. 40 కోట్ల దాకా స్వాహా చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలిందట. త్వరలోనే విజిలెన్స్‌ రిపోర్ట్‌ ప్రభుత్వానికి అందబోతున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత నాని విూద తప్పనిసరిగా యాక్షన్‌ ఉంటుందని అంటున్నారు టీడీపీ నేతలు. అదే సమయంలో గుడివాడలో కొడాలి నాని ప్రధాన అనుచరులపైనా ప్రభుత్వం ఫోకస్‌ పెట్టినట్లు టాక్‌ వినిపిస్తోంది. నానిని చూసుకుని రెచ్చిపోయిన వాళ్లను వదిలిపెట్టొద్దని టీడీపీ అధిష్టానం విూద ఒత్తిడి పెరుగుతోందటజగనన్న కాలనీల కోసం గుడివాడ నియోజకవర్గం మల్లాయపాలెంలో 178.3 ఎకరాలు సేకరించారు. ఎకరా రూ.52 లక్షలు పెట్టి కొన్నారట. అదంతా లోతట్టు ప్రాంతంగా ఉండటంతో సరి చేయాలన్న కారణంతో అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న కొడాలి నాని..అడ్డగోలుగా వర్క్‌ చేయించారట. దగ్గరలోని చెరువుల్లో మట్టిని తెంచి నింపేశారట. బిల్లులు మాత్రం ఎక్కడో దూరం నుంచి గ్రావెల్‌ తరలించినట్లు చూపి కోట్ల రూపాయలు కొల్లగొట్టారని ఆరోపణలు ఉన్నాయి. మెరక వర్క్‌ ఆర్డర్లు పొందిన వారంతా కొడాలి నాని అనుచరులేనని..ఆయన బినావిూగా ఉన్న వారి ఖాతాల్లోకి సొమ్ము జమ అయిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపైనే కూటమి సర్కార్‌ ఇంటర్నల్‌గా విజిలెన్స్‌ రిపోర్ట్‌ రెడీ చేయిస్తుందని..ఆ తర్వాత అసలు కథ ఉంటుందని అంటున్నారు.కొడాలి నానిని అన్ని దిక్కుల కార్నర్‌ చేస్తున్నట్లే కనిపిస్తోంది. ఓ కేసు కాకపోతే మరో కేసు..ఇలా అన్ని దిక్కుల ఇరికించి ఇబ్బంది పెడితేనే మరోసారి బూతు మాటలు మాట్లాడకుండా ఉంటారని టీడీపీ నేతలు..కూటమి ప్రభుత్వం విూద ప్రెజర్‌ తెస్తున్నారట. ఇప్పటికే నాని విూద యాక్షన్‌ తీసుకోవడం ఆలస్యమైందని టీడీపీ క్యాడర్‌ అసంతృప్తిలో ఉందని అంటున్నారు. ఇంటర్నల్‌ ఎంక్వైరీలతో పూర్తి ఆధారాలు వచ్చాక ఇరికించాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే..టీడీపీ క్యాడర్‌, లీడర్లు మాత్రం నాని విూద ఆగ్రహంతో రగిలిపోతున్నారట. కొడాలి నానిని ఎప్పుడు అరెస్ట్‌ చేస్తారంటూ సందర్భం వచ్చినప్పుడల్లా అగ్రనేతలను క్వశ్చన్‌ చేస్తున్నట్లు టాక్‌ వినిపిస్తోంది.అయితే కొన్నిరోజులుగా కొడాలి నాని గుడివాడకు రావడం లేదట. ఆయన ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నారో కొందరు ముఖ్య నేతలకే తెలుసు అంటున్నారు. తిరుమల లడ్డూ ఇష్యూ అప్పుడు వైసీపీ అధినేత జగన్‌తో భేటీ తర్వాత విూడియాతో మాట్లాడిన నాని.. అప్పుడు కూడా చంద్రబాబును టార్గెట్‌ చేస్తూ మాట్లాడారు. ఆ తర్వాత ఫైర్‌ బ్రాండ్‌ లీడర్‌ తగ్గరంటూ వైసీపీ చర్చకు తెరలేపింది. సేమ్‌ టైమ్‌ నాని విూద చర్యలు తీసుకోవాల్సిందేనని టీడీపీ క్యాడర్‌ పట్టుబడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ముందుగా కొడాలి నానికి ముఖ్య అనుచరులుగా ఉన్న వారి విూద కేసులు పెట్టేందుకు రంగం సిద్ధం అవుతోందట. ఆ తర్వాత నానికి కేసులు విచారణలు తప్పవంటున్నారు కూటమి నేతలు.

Tags:

Latest News

కొడాలి నానిని చుట్టుముడుతున్న కేసులు కొడాలి నానిని చుట్టుముడుతున్న కేసులు
విజయవాడ - ప్రభాత సూర్యుడుకొడాలి నాని. తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని ఈ నేత కాంట్రవర్సీలకు కేరాఫ్‌. వైపీపీ హయాంలో చంద్రబాబు, లోకేశ్‌ను అడ్డగోలుగా బూతులు తిట్టారని..వాళ్ల...
రేషన్‌ బియ్యం అక్రమ రవాణాపై ఉక్కు పాదం
అయ్యప్ప స్వామి భక్తులకు అలెర్ట్
కలకలం రేపుతున్న పరువు హత్య
ప్రభుత్వ హాస్టల్ విద్యార్థులను సొంత బిడ్డలా చూసుకోవాలి
అంగన్వాడీలకు నిరంతరం పాలు అందాలి: సీతక్క
విభజన అంశాలపై నేడు ఏపీ, తెలంగాణ అధికారుల కమిటీ భేటీ