రేషన్‌ బియ్యం అక్రమ రవాణాపై ఉక్కు పాదం

కింగ్‌ పిన్‌ ఎవరు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ కు భద్రత పెంచాల్సి ఉందా ?

On
రేషన్‌ బియ్యం అక్రమ రవాణాపై ఉక్కు పాదం

కాకినాడ - ప్రభాత సూర్యుడు 
పేదలకు ప్రభుత్వాలు అందించే పీడీఎస్‌ బియ్యం అక్రమ రవాణా చేస్తే పీడీ యాక్ట్‌ నమోదు చేస్తామని ఏపీ ప్రభుత్వం హెచ్చరించింది. ఏపీలో పోర్టుల నుంచి రేషన్‌ బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాకినాడ యాంకరేజ్‌ పోర్టులో బియ్యం ఎగుమతి చేస్తున్న విదేశీ నౌక పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏపీ పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. మంత్రి నాదెండ్ల అధ్యక్షతన మంత్రులు అచ్చెన్నాయుడు, సత్య కుమార్‌ యాదవ్‌ మరియు ఉన్నతాధికారులతో  సవిూక్ష సమావేశం జరిగింది. కాకినాడ పోర్టులోని అయిదు వేర్‌ హౌసుల్లో సార్టెక్స్‌ మిషన్లు ఉన్న అంశంపై చర్చించారు. వేర్‌ హౌసుల్లో యంత్రాలు ఏ విధంగా ఏర్పాటు చేశారని మారిటైమ్‌ బోర్డు, కాకినాడ పోర్టు అధికారులను రాష్ట్ర మంత్రులు ప్రశ్నించారు. సార్టెక్స్‌ యంత్రాలను ఏర్పాటుపై విచారణ చేపట్టాలని, అందుకు బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఆంధ్రప్రదేశ్‌ నుంచి రేషన్‌ బియ్యం అక్రమ రవాణా, కాకినాడ పోర్టు నుంచి తరలిపోతున్న బియ్యం, ఇతరత్రా అక్రమ రవాణా వ్యవహారంపై మంత్రులు సవిూక్షలో కీలకంగా చర్చించారు. నాదెండ్ల, అచ్చెన్నాయుడు, సత్యకుమార్‌ జరిపిన సవిూక్షలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇకనుంచి ఎవరైనా పీడీఎస్‌ బియ్యం అక్రమ రవాణా చేస్తున్న వారిపై పీడీ యాక్ట్‌ నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయం. కాకినాడ పోర్టులో భద్రత వ్యవస్థ బలోపేతం చేయాలని నిర్ణయించారు. కాకినాడ పోర్టు భద్రత కోసం ఛీఫ్‌ సెక్యురిటీ ఆఫీసర్‌ నియమించాలని చర్చించారు. రేషన్‌ బియ్యం అక్రమ రవాణాను వ్యవస్థీకృత నేరంగా పరిగణించాలని మంత్రులు భావిస్తున్నారు. కాకినాడ పోర్టు, పరిసర ప్రాంతాల్లో ఇప్పటివరకూ జరిగిన రవాణా కార్యకలాపాలపై చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. కాకినాడ పోర్టుకు వెళ్లే లారీల నుంచి అక్రమ వసూళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు నాదెండ్ల మనోహర్‌. కాకినాడ యాంకరేజ్‌ పోర్టులో బియ్యం ఎగుమతి చేస్తున్న స్టెల్లా ఓడ ఘటనలో బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మొదట కాకినాడ కలెక్టర్‌ , కొందరు ఉన్నతాధికారులతో వెళ్లి కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు ఎగుమతి అవుతున్న రేషన్‌ బియ్యాన్ని సీజ్‌ చేయాలని ఆదేశించారు. కాకినాడ కలెక్టర్‌ సాహసం దేశ వ్యాప్తంగా వైరల్‌ అయింది. ఆ సమయంలో ఢల్లీి పర్యటనలో ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ ఏపీకి వచ్చాక కాకినాడ పోర్టు విషయంపై ఫోకస్‌ చేశారు. పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌, కొందరు ఉన్నతాధికారులతో కలిసి వెళ్లి పవన్‌ కళ్యాణ్‌ కాకినాడ యాంకరేజ్‌ పోర్టులో తనిఖీలు చేయడం తెలిసిందే. పవన్‌ కళ్యాణ్‌ ను అధికారులు అడ్డుకోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ తూర్పు దేశంలో భద్రతకు ముప్పు పొంచి ఉందని, కాకినాడ పోర్టులో కేవలం 16, 17 మంది అధికారులే ఉన్నారని.. టన్నుల కొద్దీ రేషన్‌ బియ్యం విదేశాలకు రవాణా చేశారని ఆరోపించారు. సీజ్‌ ద షిప్‌ అంటూ పవన్‌ కళ్యాణ్‌ చేసిన కామెంట్స్‌ సోషల్‌ విూడియాలో దేశ వ్యాప్తంగా ట్రెండ్‌ అయింది. అయితే కేంద్రం పరిధిలో ఉన్న అంశాలపై రాష్ట్ర ప్రభుత్వానికి చర్యలు తీసుకునే అధికారం లేదని, కేంద్రానికి ఫిర్యాదు చేయాలని నిబంధనలు చెబుతున్నారు.
కింగ్‌ పిన్‌ ఎవరు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ కు భద్రత పెంచాల్సి ఉందా? కాకినాడకు వెళ్తానన్న పవన్‌ ను అడ్డుకున్నదెవరు? పవన్‌ పర్యటనతో వెలుగులోకి వచ్చిన ఆ కింగ్‌ పిన్‌ ఎవరు? అన్ని కోట్లు గోల్‌ మాల్‌ జరుగుతుంటే అధికారులు ఇన్ని రోజులు ఏం చేశారు? ఈ ప్రశ్నలే ప్రస్తుతం ఏపీలో వినిపిస్తున్నాయి.కాకినాడ పోర్ట్‌ ఆధారంగా కోట్ల విలువైన రేషన్‌ బియ్యం సరఫరాను ఇటీవల కాకినాడ కలెక్టర్‌ అడ్డుకున్నారు. డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ లు సంయుక్తంగా ఇచ్చిన ఆదేశాలతో కలెక్టర్‌ మెరుపుదాడులు నిర్వహించారు. భారీ స్థాయిలో రేషన్‌ ను పట్టుకున్నారు. అయితే డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ ఢల్లీి పర్యటన ముగించుకొని నేరుగా కాకినాడ పోర్టుకు వచ్చారు.ఇక్కడే నేరుగా పవన్‌ కళ్యాణ్‌ కు అడ్డంకులు సృష్టించారట. ఈ మాటలన్నది ఎవరో కాదు పవన్‌. తాను పోర్టుకు వస్తానంటే అడుగడుగున అడ్డంకులు తగిలాయని, అలాగే కాకినాడ పోర్టు వద్దకు వచ్చినా కూడా.. సీజ్‌ చేసిన షిప్‌ వద్దకు తనను తీసుకెళ్లేందుకు కూడా అదే వ్యవహారం సాగిందని పవన్‌ అన్నారు. అంటే రేషన్‌ బియ్యం అక్రమ రవాణా సాగిస్తూ.. కోట్లకు పడగలెత్తిన ఆ కింగ్‌ పిన్‌ హవా పోర్టులో ఏ మేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం పేదలకు ఉచితంగా అందించే రేషన్‌ బియ్యం ఆఫ్రికా వంటి దేశాల్లో ఏకంగా రూ. 70 లు పలుకుతుందట. ఇదే ఆసరాగా తీసుకున్న ముఠా పెద్ద ఎత్తున ఇక్కడ ఎన్నో ఏళ్లుగా రేషన్‌ సామ్రాజ్యాన్ని విస్తరించారని మంత్రి నాదెండ్ల మనోహర్‌ అంటున్నారు. కేవలం మూడేళ్లలో రూ. 45 వేల కోట్ల విలువైన రేషన్‌ బియ్యం అక్రమ రవాణా సాగినట్లు మనోహర్‌ తేల్చారు. సీఎం చంద్రబాబు సైతం ఈ ఘటనపై స్పందించి, ఆ కింగ్‌ పిన్‌ ఎవరైనా వదిలేది లేదంటూ ప్రకటించారు. ఈ నేపథ్యంలో పవన్‌ తన పర్యటనలో కొన్ని కీలక కామెంట్స్‌ చేశారు. రేషన్‌ బియ్యం స్మగ్లింగ్‌ చేస్తున్నారు. రేపు స్మగ్లర్లు ఇంతటితో ఆగుతారా.. డబ్బులను కక్కుర్తి పడి ఉగ్రవాదులను తీసుకువస్తారుగా అంటూ అధికారులను ప్రశ్నించారు. ఇప్పుడు అసలు సంగతి ఏమిటంటే.. ఆ కింగ్‌ పిన్‌ ఎవరనేది ప్రశ్న. ఏకంగా పవన్‌ అడ్డుకునే స్థాయిలో ఆ కింగ్‌ పిన్‌ తెర వెనుక ఉన్నాడంటే.. అతని సామ్రాజ్యం కాకినాడ పోర్టులో పెద్దగా విస్తరించిందని కూడా చర్చలు సాగుతున్నాయి. పవన్‌ పర్యటనతోనే కాకినాడ పోర్టు వార్తల్లో రావడం, కోట్లలో స్మగ్లింగ్‌ బయటపడడంతో పవన్‌ కు భద్రత పెంచాలని జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు కోరుతున్నారు.దేశ భద్రతకు సంబంధించిన అంశంగా కేంద్రం సైతం భావించి, అసలు పోర్టులో ఏం జరుగుతుందనే విషయాలను ఆరా తీసినట్లు సమాచారం. రేషన్‌ మాఫియా వెనుక ఎవరున్నారనే వేటలో పోలీసులు దృష్టి సారించినా, కింగ్‌ పిన్‌ ను కూకటివేళ్లతో కదిలించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా కింగ్‌ పిన్‌ చరిత్ర త్వరలోనే గుట్టురట్టు కావాలని రాష్ట్ర ప్రజలు కోరుతున్నారు. అలాగే కాకినాడ పోర్టులో జరుగుతున్న అక్రమాలను వెలుగులోకి తెచ్చిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌, మంత్రి నాదెండ్ల మనోహర్‌ లకు ప్రజలు ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నారు.

Tags:

Latest News

కొడాలి నానిని చుట్టుముడుతున్న కేసులు కొడాలి నానిని చుట్టుముడుతున్న కేసులు
విజయవాడ - ప్రభాత సూర్యుడుకొడాలి నాని. తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని ఈ నేత కాంట్రవర్సీలకు కేరాఫ్‌. వైపీపీ హయాంలో చంద్రబాబు, లోకేశ్‌ను అడ్డగోలుగా బూతులు తిట్టారని..వాళ్ల...
రేషన్‌ బియ్యం అక్రమ రవాణాపై ఉక్కు పాదం
అయ్యప్ప స్వామి భక్తులకు అలెర్ట్
కలకలం రేపుతున్న పరువు హత్య
ప్రభుత్వ హాస్టల్ విద్యార్థులను సొంత బిడ్డలా చూసుకోవాలి
అంగన్వాడీలకు నిరంతరం పాలు అందాలి: సీతక్క
విభజన అంశాలపై నేడు ఏపీ, తెలంగాణ అధికారుల కమిటీ భేటీ