కలకలం రేపుతున్న పరువు హత్య

మహిళా కానిస్టేబుల్ దారుణ హత్య

On
కలకలం రేపుతున్న పరువు హత్య

IMG-20241202-WA0015రంగారెడ్డి - ప్రభాత సూర్యుడు 

రంగారెడ్ది జిల్లాలో సోమవారం ఉదయ జరిగిన పరువు హత్య కలకలం సృష్టించింది.  ప్రేమ వివాహం చేసుకొని తమ పరువు తీసిందని నాగమణి అనే మహిళను తోడబుట్టిన సోదరుడే దారుణంగా హత్య చేసి చంపేశాడు. వివరాల్లోకి వెళితే.. రంగారెడ్ది జిల్లాలో ఇబ్రహీంపట్నం మండల రాయపోల్ గ్రామానికి చెందిన కొంగర రమేష్, పద్మ దంపతుల చిన్న కూతురు నాగమణి హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తుంది. గత నెల రాజుల క్రితం అదే గ్రామానికి చెందిన శ్రీకాంత్ అనే యువకుడిని  ప్రేమ వివాహం చేసుకుంది. తమకు ఇష్టం లేని ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన శ్రీకాంత్ ను పెళ్లి చేసుకొని పరువు తీసిందని భావించిన మృతురాలి సోదరుడు పరమేష్ కక్ష పెంచుకున్నాడు. ఇదిలా ఉంటే నాగమణి  సోమవారం ఉదయం విధులకని ఇంటి నుండి తన ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా సోదరుడు పరమేశ్ వెంబడించాడు. అదును చూసుకుని పరమేశ్ తన కారుతో నాగమణి బైకును డీకొట్టాడు. క్రింద పడిపోయిన నాగమణి పై పరమేశ్ తన వెంట తెచ్చుకున్న కత్తితో విచక్షణా రహితంగా మొహంపై దాడి చేశాడు. దీంతో నాగమణి అక్కడికక్కడే చనిపోయింది. విషయం తెలుసుకున్న ఇబ్రహీంపట్నం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

IMG-20241202-WA0012

Tags:

Latest News

కొడాలి నానిని చుట్టుముడుతున్న కేసులు కొడాలి నానిని చుట్టుముడుతున్న కేసులు
విజయవాడ - ప్రభాత సూర్యుడుకొడాలి నాని. తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని ఈ నేత కాంట్రవర్సీలకు కేరాఫ్‌. వైపీపీ హయాంలో చంద్రబాబు, లోకేశ్‌ను అడ్డగోలుగా బూతులు తిట్టారని..వాళ్ల...
రేషన్‌ బియ్యం అక్రమ రవాణాపై ఉక్కు పాదం
అయ్యప్ప స్వామి భక్తులకు అలెర్ట్
కలకలం రేపుతున్న పరువు హత్య
ప్రభుత్వ హాస్టల్ విద్యార్థులను సొంత బిడ్డలా చూసుకోవాలి
అంగన్వాడీలకు నిరంతరం పాలు అందాలి: సీతక్క
విభజన అంశాలపై నేడు ఏపీ, తెలంగాణ అధికారుల కమిటీ భేటీ