బుగ్గపాడు ఫుడ్ పార్క్ లో నాన్ టెక్నికల్ ఉద్యోగాలు స్థానిక ప్రజలకు ఇవ్వాలి
డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ సత్తుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే
సత్తుపల్లి - ప్రభాత సూర్యుడు
మండల పరిధిలో బుగ్గపాడు గ్రామం లో మెగా ఫుడ్ పార్క్ ని ఆకస్మిక తనిఖీ చేసిన సత్తుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ మెగా ఫుడ్ పార్క్ లోని పలు యూనిట్ లను సందర్శించారు.
ఫుడ్ పార్క్ జోనల్ మేనేజర్ మహేశ్వర్ ద్వారా ఫుడ్ పార్క్ సంబంధిత వివరాలు తెలుసుకున్నారు.
బుగ్గపాడు స్థానిక ప్రజలు మరియు ఫుడ్ పార్క్ కు ఆనాడు భూములు అందించిన రైతు సోదరులు ఎమ్మెల్యే కి ఫుడ్ పార్క్ లోని అధికారులు కాంట్రాక్టర్ ల వలన కలుగు సమస్యలు గురించి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ కీ, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ కి తెలియజేసారు.
అనంతరం బుగ్గపాడు ఫుడ్ పార్క్ లోని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ను మరియు ఫుడ్ పార్క్ లో నిర్మించిన పలు పరిశ్రమ భవనాలను పరిశీలించారు.
త్వరలో నూతనం గా ప్రారంభించాబోయే "డ్రై ఫ్రూట్ " పరిశ్రమ ను పరిశీలించారు.
అందుబాటులో ఉన్న కాంట్రాక్టర్ కు నాణ్యత, పనులు, సెక్యూరిటీ గురించి పలు సూచనలు తెలియజేసారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ..
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి , వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరావు మరియు ఐటీ శాఖ మంత్రివర్యులు దుద్ధిల్లా శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో బుగ్గపాడు ఫుడ్ పార్క్ అభివృద్ధి కీ, నూతన పరిశ్రమల ఆహ్వానానికి కృషి చేస్తాము అని తెలిపారు. ఫుడ్ పార్క్ లో నాన్ టెక్నికల్ ఉద్యోగాలు స్థానిక ప్రజలకు 100% ఇవ్వాలి అని సంబంధిత అధికారులకు తెలియజేసారు.
ఫుడ్ పార్క్ అభివృద్ధి కోసం వెంటనే ముఖ్య మంత్రి , వ్యవసాయం మంత్రి తుమ్మల , ఐటీ మినిస్ట్రీర్ మరియు ఖమ్మం జిల్లా కలెక్టర్ తో చర్చించి త్వరతగిన అభివృద్ధి కీ కృషి చేసి స్థానిక నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన కల్పిస్తాము అని తెలియజేసారు.
ఫుడ్ పార్క్ లో ఇంకా భూములు అందించిన కొంతమంది రైతులకు డబ్బులు రాకపోవటం తో వాటి గురించి ప్రభుత్వం తో మరియు అధికారులు తో మాట్లాడి సమస్య పరిష్కరిస్తాము అని తెలియజేసారు.
ఈ కార్యక్రమం లో సత్తుపల్లి మార్కెట్ చైర్మన్ దోమ ఆనంద్, ఎంపీడీఓ,జోనల్ మేనేజర్ మహేశ్వర్, జె ఈ శివ,ఎస్సై , సీడీపీఓ , కాంట్రాక్టర్ వాహబ్, సీనియర్ నాయకులు చల్లగుళ్ల నరసింహ రావు, సుబ్బారెడ్డి, నరేంద్ర రెడ్డి, కిసర రాంబాబు,బుగ్గపాడు, రుద్రాక్షపల్లి గ్రామ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.