పటాన్ చెరువు అయ్యప్ప దేవాలయంలో స్వామియే శరణమయ్యప్ప నామస్వరనతో మార్మోగిన శాంతినగర్

స్వాముల,భక్తుల మన్ననలను పొందుతున్న గురుస్వామి వెంకటేశ్వర్లు (కాజు)

On
పటాన్ చెరువు అయ్యప్ప దేవాలయంలో స్వామియే శరణమయ్యప్ప నామస్వరనతో మార్మోగిన శాంతినగర్

గురుస్వామి వెంకటేశ్వర్లు (కాజు)ను శాలువతో సత్కరించి, ఆలయ స్మృతి జ్ఞాపికను బహుకరిస్తున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, దేవాలయ అధ్యక్షులు గురుస్వామి డాక్టర్ నర్రా బిక్షపతి పటేల్, ఆలయ గౌరవ అధ్యక్షుడు గురు స్వామి సంజీవరెడ్డి

Captureపటాన్ చెరు - ప్రభాత సూర్యుడు 

పటాన్ చెరువు శాంతినగర్ అయ్యప్ప స్వామి దేవాలయంలో శరణమయ్యప్ప నామస్వరనతో శాంతినగర్ కాలనీలో అయ్యప్ప భక్తులు "శరణం శరణం స్వామి శరణం స్వామియే శరణం అయ్యప్ప శరణం" అంటూ అయ్యప్పను స్మరిస్తూ స్వామి వారి ఆలయంలో అయ్యప్ప భక్తులు పోటీపడుతూ తనివి తీర స్వామి వారిని స్మరిస్తూ భక్త పర్వతులయ్యారు. శాంతినగర్ అయ్యప్పస్వామి దేవాలయ అధ్యక్షులు గురుస్వామి డాక్టర్ నర్రా బిక్షపతి పటేల్, ఆలయ గౌరవ అధ్యక్షుడు గురు స్వామి సంజీవరెడ్డి ల  ఆధ్వర్యంలో పటాన్చెరు మండలంలోని 18 పడి పూజలు పూర్తి చేసుకున్న గురుస్వాములను అయ్యప్ప స్వామి దేవాలయం తరపున ఆలయ స్మృతి జ్ఞాపికలను అందజేసి, శాలువాలతో ఘనంగా సత్కరించడం జరిగింది. మండల స్థాయి పూజలను పురస్కరించుకొని అయ్యప్ప స్వామి దేవాలయంలో గణపతి హోమం, మహా అన్నదానమును ఏర్పాటు చేసి, విశేష పూజలు నిర్వహించి, అయ్యప్ప స్వాములతో ఊరేగింపు నిర్వహించడం జరిగింది. స్వాములకే పెద్ద స్వామి అయిన గురుస్వామి వెంకటేశ్వర్లు( కాజు ) స్వామి ఆధ్వర్యంలో బేద,తారతమ్యాలు లేకుండా అయ్యప్ప స్వామి పడి పూజలు గురుస్వాములు పులి బల్వంతరావు, నామరాజు ( నరసింహులు), శ్రీధర్ చారి, నందిగామ దేవి గురు స్వామి అలంకార రూప గురు స్వామి  భాస్కర్, గురు స్వాములు శ్రీనివాస చారి, మణికంఠ( బుగ్గ ), మోహన్ స్వామి, జ్ఞాన సాయి( నాని), చరణ్ స్వామి, మణి తేజ స్వాముల వారి బృందాలతో మండలంలోని ఏ దేవాలయంలోనైనా, గృహ సన్నిధానాలలోనైనా  స్వచ్ఛందంగా స్వామి వారిని అలంకరించి, స్వామివారికి సేవలు చేస్తూ అయ్యప్ప స్వాముల దీవెనలు పొందుతున్నారు. శబరి కొండ లో ఉన్న అయ్యప్ప కొలువు తీరిన రీతిలో స్వామివారిని అలంకరణ చేస్తూ సేవలు అందిస్తున్నారు. స్వాములకే పెద్ద స్వామి అయిన గురు స్వామి వెంకటేశ్వర్లు( కాజు ) వారిచే అయ్యప్ప స్వామి పడిపూజలు 18 కలశాలలో, వేదమంత్రాలతో, అయ్యప్ప భజన మండలి వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. వెంకటేశ్వర్లు (కాజు) గురుస్వామి అమృత గానం కు పడిపూజకు విచ్చేసిన భక్త బృందం తనివి తీర చూసి, మంత్రముగ్దులు కావడం విశేషం. ఎక్కడ అయ్యప్ప పూజ ఐతే, ఎక్కడ పడిపూజ జరిగితే అక్కడికి గురుస్వామి వెంకటేశ్వర్లు( కాజు) ప్రత్యక్షమై పడిపూజ లను భక్తి, శ్రద్ధలతో, భజనలతో, స్వామియే శరణం అయ్యప్ప అనిపిస్తూ అయ్యప్ప మాల ధరించిన స్వాములకు పూజ నిష్ట విధానాన్ని తెలుపుతూ, అందరి నోట శరణం, శరణం అనిపిస్తూ, గురు స్వామిగా స్వాముల, భక్తుల మన్నలను గురు స్వామి వెంకటేశ్వర్లు( కాజు) పొందుతున్నారు. 

Tags:

Latest News