కాలనీ వాసుల సంక్షేమమే ధ్యేయం
కౌన్సిలర్ దండెం కృష్ణారెడ్డి
- 40 లక్షల రూపాయల నిధులతో కమ్యూనిటీ హాల్ భవనానికి శంకుస్థాపన
- చైర్ పర్సన్ పండుగల జయశ్రీ రాజు
అబ్దుల్లాపూర్ మెట్ - ప్రభాత సూర్యుడు
మున్సిపాలిటీ పరిధిలోని కాలినీల సంక్షేమమే ధ్యేయమని పెద్ద అంబర్ పేట్ మున్సిపల్ చైర్ పర్సన్ పండుగల రాజు అన్నారు. మున్సిపాలిటీ కేంద్రం 7వ వార్డులో స్వగృహ కాలనీలో 40 లక్షల రూపాయల నిధులతో కమ్యూనిటీ హాలు భవనానికి చైర్ పర్సన్ పండుగల జయశ్రీ రాజు, స్థానిక కౌన్సిలర్ దండెం కృష్ణారెడ్డి తో కలిసి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సాధ్యమైనంత మేరకు అధిక నిధులు కేటాయించి కాలనీ వాసుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు కొనసాగుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్ పర్సన్ చామ సంపూర్ణ విజయ శేఖర్ రెడ్డి, కౌన్సిలర్లు సిద్ధంకి కృష్ణారెడ్డి, పసుల రాజేందర్, కో ఆప్షన్ సభ్యులు ఖలీమ్, మున్సిపల్ కమిషనర్ రవీందర్ రెడ్డి, డిఈఈ శివానంద్, ఏడీఈ సుమంత్ కుమార్, నాయకులు బొర్ర సురేష్, కాలనీవాసులు పాల్గొన్నారు.