కెటిఆర్ కు పెద్ద షాక్
భూకబ్జా కేసులో ప్రధాన అనుచరుడి అరెస్టు
సిరిసిల్ల - ప్రభాత సూర్యుడు
బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంఎల్‌ఏ కెటిఆర్ అనుచరుడిని పోలీసులు అరెస్టు చేశారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని సర్దపూర్ లో కెటిఆర్ ప్రధాన అనుచరుడు బిఆర్‌ఎస్ కీలక నేత బొల్లి రామ్మోహన్ ను అరెస్టు చేశారు. అతడు అక్రమంగా ప్రభుత్వ భూమిని కబ్జాచేసి, చాలా కాలంగా కంకర క్వారీ నిర్వహిస్తున్నాడని అభియోగం. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో అతడిని శనివారం తెల్లవారుజామున పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.బొల్లి రామ్మోహన్ సిరిసిల్ల పట్టణ బిఆర్‌ఎస్ బిసి విభాగం అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అతడు ఇసుక మాఫియా, భూకబ్జా చేస్తూ కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నాడని ఆరోపణలున్నాయి. కాగా రామ్మోహన్ అరెస్టు ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
Related Posts
Latest News
*రేపు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి రాక*
04 Dec 2024 21:43:58
పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణి