విద్యా మంత్రి లేకనే అనర్థాలు

కస్బా శంకర్ రావు, చీఫ్ ఎడిటర్ ప్రత్యేకం

On
విద్యా మంత్రి లేకనే అనర్థాలు

- మాగనూర్ ఫుడ్ పాయిజన్‌ పై హైకోర్టు సీరియస్.. 
- అధికారులకు పిల్లలు లేరా అంటూ హైకోర్టు ఘాటుగా మందలింపు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తేలుకొని వెంటనే
- విద్యామంత్రిని ఏర్పాటు చేయాలి 
- ఈ ఘటనే మొదటిది, చివరిది కావాలి
- విద్యమంత్రి కై విద్యార్థుల తల్లిదండ్రుల మూకుమ్మడి డిమాండ్

WhatsApp Image 2024-11-27 at 8.05.04 PMహైదరాబాద్ - ప్రభాత సూర్యుడు

నారాయణపేట జిల్లా మాగనూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించడంపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వారం వ్యవధిలో మూడుసార్లు భోజనం వికటిస్తే అధికారులు నిద్రపోతున్నారా? అంటూ  హైకోర్టు సీజే జస్టిస్ అలోక్ అరాధే అసహనం చేస్తూ, ఘాటుగా మందలిస్తూ  ఇది చాలా సీరియస్ అంశమని సీజే ధర్మాసనం అభిప్రాయపడింది. కాగా, ఫుడ్ పాయిజన్‌ పై సీనియర్ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం పై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఫుడ్ పాయిజన్‌తో విద్యార్థులు చనిపోతే కానీ స్పందించరా? అంటూ హైకోర్టు సీజే ధర్మాసనం ప్రభుత్వం తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది.WhatsApp Image 2024-11-27 at 8.05.03 PM

అధికారుల నిర్లక్ష్యానికి ఇది నిదర్శనమని మండిపడింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకోవడం లేదని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ సంఘటనపై వారంలోగా కౌంటర్ దాఖలు చేస్తామన్న ప్రభుత్వ న్యాయవాది పై హైకోర్టు సీజే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలో ఉండే అధికారిని సంప్రదించి వివరాలు సేకరించడానికి వారం వ్యవధి ఎందుకని సీజే ప్రశ్నించారు. హైకోర్టు ఆదేశాలు ఇస్తేనే అధికారులు పనిచేస్తారా? అంటూ ఆగ్రహించారు. నాన్‌ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తే 5 నిమిషాల్లో అధికారులు హాజరవుతారని చురకలు అంటించారు. అధికారులకు కూడా పిల్లలు ఉన్నారు కదా? అని ఈ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం గుర్రుమని గుర్తు చేసింది. అధికారులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని ఉన్నత న్యాయస్థానం చెప్పింది. నేటి విద్యార్థులే రేపటి భావిభారత పౌరులు అనే అర్థం వచ్చేటట్లు హైకోర్టు అధికారులకు గడ్డి పెట్టింది.. భోజన విరామం తర్వాత ఈ ఘటన కు సంబంధించిన పూర్తి వివరాలు అందిస్తామని హైకోర్టుకు ఏఏజీ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తరచూ భోజనం వికటిస్తోందని హైకోర్టు కు చిక్కుడు ప్రభాకర్ తెలిపారు. ఇంత హృదయ విషాదకర సంఘటన జరిగిన తర్వాత కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యా శాఖకు విద్య మంత్రిని నియమించాలనే ఆలోచన రావాలని  విషాహారం తిని అశ్వస్తతకు గురి అయిన విద్యార్థుల తల్లిదండ్రులు వేడుకొంటుండడం కొసమెరుపు. ప్రభాత సూర్యుడు పత్రిక సైతం గతంలోనే విద్యాశాఖ కు విద్యామంత్రి లేక  "బోసిపోతున్న తెలంగాణ విద్యారంగం" అంటూ ప్రభాత సూర్యుడు ప్రభుత్వాన్ని మేల్కొలిపిన విషయాన్ని ప్రభుత్వ పెద్దలు గుర్తిస్తూ, మరొకసారి ఆలోచించి తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖకు  విద్యామంత్రిని  ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై సహచర మంత్రుల బృందం ఒత్తిడి పెట్టక తప్పదని 'ప్రభాత సూర్యుడు' పత్రిక సూచిస్తుంది.

Tags:

Latest News