రైతులు భూసార పరీక్షలు చేయించుకోవాలి
చిలుకూరు (ప్రభాత సూర్యుడు)
రైతులు భూసార పరీక్షలు చేయించుకోవాలని, అందుకు అనుగుణంగా ఎరువులు వాడాలని మండల వ్యవసాయ అధికారి శ్రీధర్ అన్నారు. శుక్రవారం చిలుకూరు మండలం బేతావోలు గ్రామంలో వ్యవసాయ అధికారులు పొలాల్లోకి వెళ్లి మట్టి నమూనాలను సేకరించారు. ఈ సందర్భంగా ఏవో మాట్లాడుతూ రైతులు తమ పొలాల్లో మట్టి నమూనాలను తీసుకొని వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఇస్తే ఉచితంగా భూసార పరీక్షలు చేయించి, భూసారలోపాలను తెలియజేస్తామని అన్నారు. ఈ అవకాశాన్ని రైతులు ఉపయోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ చంద్రశేఖర్, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
Tags:
Latest News
*రేపు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి రాక*
04 Dec 2024 21:43:58
పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణి