తెలుగుదేశం కండువ వేసుకోవడం ఖాయం

డిసెంబర్ 5,6 తేదీల్లో ముహూర్తం ఖరారు

On
తెలుగుదేశం కండువ వేసుకోవడం ఖాయం

- ప్రభాత సూర్యుడు చీఫ్ ఎడిటర్ కస్భా శంకర్ రావుతో మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి

- తీగల కృష్ణారెడ్డి రాకతో తెలంగాణ తెలుగు తమ్ముళ్లలో నయ జోష్ 
- రాజకీయ ఆశవాహులకు అతిపెద్ద వేదికగా మారునున్న తెలంగాణ తెలుగుదేశం పార్టీ
- తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ వర్గాలలో ఆశాకిరణంగా టి తెలుగుదేశం 
- ఆదరణ కోల్పోయిన తెలంగాణ ఉద్యమకారులకు మరొక ఆయుధం కానున్న పసుపు జెండా
- తెలంగాణ తెలుగుదేశం పూర్వ నాయకుల రహస్య చర్చలు 
- హైదరాబాద్ సీమాంద్ర వన బోజనాలకు సన్నాహాలు ? పార్టీ బలోపేతానికి మంతనాలు !
- తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి పార్టీలకు తెలంగాణలో బిగ్ టాస్క్
- హైదరాబాద్ ఐటీ ఉద్యోగులాంత తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి పార్టీల వెనకేనంటున్న రాజకీయ విశ్లేషకులు

హైదరాబాద్ - ప్రభాత సూర్యుడు 
 
వచ్చే డిసెంబర్ 5, 6 తేదీలలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకోవడం ఖాయమని, అందుకు సంబందించి కార్యాచరణ మొత్తం పూర్తయ్యిందని మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి 'ప్రభాత సూర్యుడు" దిన పత్రికతో ప్రత్యేకంగా తెలిపారు. శనివారం తీగల కృష్ణారెడ్డి ప్రభాత సూర్యుడు చీఫ్ ఎడిటర్ కస్బా శంకర్ రావుతో మాట్లాడారు.
 
డిసెంబర్ 3 వ తేదీనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత  నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా తెలుగుదేశం పార్టీ  కండువా వేసుకోవాల్సి ఉండగా.. కొన్ని అనివార్య కారణాలచే పార్టీలో చేరిక కావడంలో జాప్యం ఏర్పడిందని, డిసెంబర్ 5 లేదా 6 తేదీలలో తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారేయిందని, అందుకోసం భారీగా రంగం సిద్దామయ్యిందని అన్నారు.

మేయర్ గా.. హుడా ఛైర్మన్ గా... 

ఉమ్మడి రాష్ట్రలో 2002లో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసి 100 డివిజన్లలో 40 లక్షల మెజారిటీతో గెలుపొందిన కృష్ణారెడ్డి మేయర్ గా నియమితులయ్యారు. అనంతరం ఏకదాటిగా 9 సంవత్సరాలు హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటి ( హుడా)  ఛైర్మన్ గా పనిచేశారు. 2009 లో మహేశ్వరం నియోజకవర్గం నుండి పోటీచేసినా.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డాక 2014 లో తెలుగుదేశం పార్టీ నుండి పోటీచేసి సమీప అభ్యర్ధి మల్రెడ్డి రంగారెడ్డి పై 7500 పైచిలుకు ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా మొట్టమొదటి సారి తెలంగాణ శాసనసభలో అడుగుపెట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుల ఆశీర్వాదాలతో హైదరాబాదులో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు.

కార్మిక నాయకుడి నుండి ఎమ్మెల్యేగా ప్రస్థానం.. 

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశలో కార్మిక నాయకుడిగా బిహెచ్ఈఎల్ లో వరుసగా మూడు పర్యాయాలు సంఘం నాయకుడిగా గెలిచానని, పటాన్ చెరు పారిశ్రామిక ప్రాంతంలో కిర్బి, అశోక లియోలాండ్ పరిశ్రమలలో కార్మిక సంఘం అద్యక్షుడిగా కార్మికులకు అండగా ఉన్నట్లు తెలిపారు తీగల కృష్ణారెడ్డి. పటాన్ చెరులోని ఏసియన్ పెయింట్స్ కంపెనీలో జరిగిన యూనియన్ ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు గెలుపొంది ఇప్పటికీ అద్యక్షునిగా కొనసాగుతున్నట్లు తెలిపారు. ఆ బలంతోనే రాజకీయ అరంగేట్రం చేసి అంచెలంచాలుగా ఏదిగానని వివరించారు. 

51GAycyl21Sతెలంగాణ తెలుగుదేశానికి పూర్వ వైభవం..

తనకు రాజకీయ భిక్ష పెట్టిన తెలుగుదేశం పార్టీని తెలంగాణలో పూర్వవైభోగం తేవడానికి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు ఘంటాపదంగా చెప్పారు. వైఎస్సార్ మరణాంతరం తెలంగాణ రాజకీయల్లో మార్పులు రావడంతో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ స్తబ్ధతగా ఉన్న మాట నిజమని అంటూ. , ఇక పై ఊపేక్షించేది లేదని తెలుగుదేశం పార్టీని తెలంగాణాలో బలోపేతం చేయడమే తన ముందున్న కర్తవ్యం అని అన్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ క్యాడర్ చెక్కుచెదరకుండా ఉందని అన్నారు. భారతీయ జనతా పార్టీ తో మరియు పవన్ కళ్యాణ్ జనసేన తో కలిసి తెలంగాణలో అతి తొందరలో జరగబోతున్న అన్ని ఎన్నికలలో బిజెపి, జనసేన, తెలుగుదేశం మూడు పార్టీలు జత కట్టి వచ్చే ఎన్నికల్లో పోటీకి వ్యూహాలు రూపొందించు కుంటామని అన్నారు. 6 గ్యారంటీ ల పేరుతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలలో 6 గ్యారెంటీల అమలు ఊసు ఎత్తక, మూసి ప్రక్షాళనం అంటూ, మూసి సుందరీకరణ అంటూ, మూసి పూర్వవైభవం అంటూ రకరకాల పేర్లు చెబుతూ హైడ్రా పేరుతో గరీబోళ్ల ఇండ్లను ధ్వంసం చేస్తూ, ప్రజా వ్యతిరేకతను కూడ గట్టుకుంటున్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తెలుగు దేశం పార్టీ తీవ్ర స్థాయిలో ఎండగడుతుందని అన్నారు. తెలంగాణ సెంటిమెంటు ను వాడుకొని కేసీఆర్ 10 సంవత్సరాల కుటుంబ పాలన చేసి, లక్షల కోట్లకు అవినీతి చేసి, గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజల ఆగ్రహానికి గురి అయిన విషయం మన కళ్ల ముందే ఉన్నదని అన్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో తెలంగాణ బతుకమ్మను ఢిల్లీ లో తాకట్టుపెట్టిన కల్వకుంట్ల కవిత ఏం మొహం పెట్టుకుని ప్రజల ముందుకు వస్తుందని తీవ్ర స్థాయిలో విరుచుక  పడ్డారు. హరీష్ రావు, కేటీఆర్ లు బయటకి మేక వన్నె పులుల లాగా ఉంటూ, ఇద్దరి బాగోతాలు తెలంగాణ ప్రజలకు తెలుసు అని అన్నారు. ప్రజలను కలవక నియంతలాగా పరిపాలించిన కెసిఆర్ కు పట్టిన గతే సీఎం రేవంత్ రెడ్డికి పట్టనున్నదని అన్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాలలో సుడిగాలి పర్యటనలు చేసి, పాత, కొత్త క్యాడర్ తో తెలంగాణలో తొందరలో స్థానిక సంస్థల ఎన్నికలలో మరియు గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేటర్ ఎన్నికల్లో తెలంగాణను పసుపు మయంతో నింపి, అత్యధిక స్థానాలను గెలిచి గ్రేటర్ హైదరాబాద్ మేయర్ పదవిని గెలిచి, తమ ప్రియతమ నాయకుడు చంద్రబాబుకు బహుమానంగా ఇవ్వనున్నట్లు ప్రభాత సూర్యుడు తో తెలిపారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం గ్రామ, గ్రామాన తెలుగుదేశం పార్టీ సైనికులు బయలుదేరనున్నారని అన్నారు. తెలుగు దేశం పార్టీ శ్రేణులను అందరిని కలుసుకుని సమన్వయంతో తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తామని తీగల కృష్ణారెడ్డి అన్నారు. తన జీవితంలో అన్ని పదవులు అనుభవించానని తనకు రాజకీయ భిక్ష పెట్టిన తెలుగుదేశం పార్టీని తెలంగాణలో అధికారంలోకి తీసుకు రావడమే తన ముందున్న కర్తవ్యం అని అన్నారు. 

తిరిగి తెలుగుదేశం పార్టీలోని వెళ్తున్న సందర్భంగా ప్రభాత సూర్యుడు పత్రిక తీగల కృష్ణారెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతుంది.💐💐

Tags:

Latest News