తెలంగాణలో మూడు రోజులు ఓ మోస్తరు వర్షాలు

పలు జిల్లాలకు హెచ్చరికలు..!!

On
తెలంగాణలో మూడు రోజులు ఓ మోస్తరు వర్షాలు

హైదరాబాద్‌ - ప్రభాత సూర్యుడు :

రాష్ట్రంలో శని, ఆది, సోమ వారాల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణశాఖ సూచించింది. శనివారం ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయి. ఆది, సోమవారాల్లో కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్‌ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వానలు పడనున్నాయి. ఈ జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో వార్నింగ్‌ జారీ చేసింది.

Tags:

Latest News