తెలంగాణలో రాబోయే కాలం తెలుగుదేశం పార్టీదే
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో జోరుగా సభ్యత్వ నమోదు
పార్టీ పోలీట్ బ్యూరో సభ్యుడు నర్సింహులు, మల్కాజ్గిరి పార్లమెంట్ అధ్యక్షుడు అశోక్ గౌడ్ వెల్లడి
ఉప్పల్ నియోజకవర్గంలోని చిలుకానగర్లో సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం
మేడ్చల్ - ప్రభాత సూర్యుడు
తెలంగాణ రాష్ట్రంలో రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందని ఆ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు నర్సింహులు, మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంట్ కన్వీనర్ అశోక్ గౌడ్ అన్నారు. ఉప్పల్ నియోజకవర్గంలోని చిలుక నగర్లో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు... పేదలకు, బడుగు బలహీన వర్గాలకు రాజకీయం నేర్పి వారిని సైతం అధికారంలో కూర్చోబెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందన్నారు. హైదరాబాద్ మహానగరం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడానికి తెలుగుదేశం పార్టీ కారణమని గుర్తు చేశారు. నందమూరి తారక రామారావు చంద్రబాబు ముఖ్యమంత్రిగా చేసిన అభివృద్ధి ఫలాలు ఇప్పటికీ పేదలకు అందుతున్నాయన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంటింటికి తిరుగుతూ మన పార్టీ అధికారంలో ఉన్న సమయంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను అమలుపరచిన సంక్షేమ పథకాలను వివరించి సభ్యత్వాన్ని తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో చిలుకానగర్ డివిజన్ అధ్యక్షుడు అశోక్, టీ టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.