గౌతమ్‌ అదానీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న ప్రధాని మోడీ

లోక్‌ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ గాంధీ

On
గౌతమ్‌ అదానీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న ప్రధాని మోడీ

లోక్‌ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ గాంధీ

కొజికోడ్‌ - ప్రభాత సూర్యుడు

ప్రధాని నరేంద్ర మోడీ పారిశ్రామికవేత్త గౌతమ్‌ అదానీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని లోక్‌ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ గాంధీ శనివారం ఆరోపించారు. ‘‘లోక్‌ సభలో మేము రాజకీయ సిద్ధాంతాలపై పోరాడుతున్నాము. మేమేమో అనుభూతులు, భావోద్వేగాలు, ప్రేమ?వంటి వాటి గురించి మాట్లాడుతున్నాం. కానీ వారేమో విద్వేషం, క్రోధం, విభజన, హింస గురించి మాట్లాడుతున్నారు. అందరినీ సమానంగా చూడాలని రాజ్యాంగం చెబుతోంది. ఇతర భారతీయలకు భిన్నంగా అదానీని మాత్రం ప్రత్యేకంగా చూస్తామని ప్రధాని మోడీ అంటున్నారు’’ అని రాహుల్‌ గాంధీ వాయనాడ్‌ లో జరిగిన బహిరంగ సభలో తెలిపారు.‘‘అమెరికా అదానీని ఆరోపిని చేసినప్పటికీ, దోషిగా చేసినప్పటికీ అదేమంత విషయం కాదని మోడీ అంటున్నారు. మన దేశంలో మాత్రం అతడిని దోషిని చేయమంటున్నారు’’ అని రాహుల్‌ గాంధీ అన్నారు. లంచం కేసులో అమెరికా ప్రాసిక్యూటర్లు అదానీని దోషిగా తేల్చారు. ఆయనపై కేంద్రం కఠిన చర్యలు చేపట్టాలని కాంగ్రెస్‌, ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి.రాహుల్‌ గాంధీ బిజెపి విూద దాడి చేస్తూ వారి వద్ద డబ్బు, ఇంటెలిజెన్స్‌ సంస్థలు, సిబిఐ, ఈడి, ఐటి వంటివన్నీ ఉన్నాయి. కానీ మా దగ్గర కేవలం ప్రజల భావోద్వేగాలున్నాయి. మేము బిజెపి సిద్ధాంతాలను ఓడిస్తామన్న విశ్వాసం మాకుంది’’ అన్నారు. ‘‘ప్రియాంక గాంధీ విూ పార్లమెంటు ప్రతినిధి. విూరామెను ఎన్నుకున్నారు. ప్రజల్లో ఉన్న అభిమానం ప్రియాంక గాంధీని ఎంపీని చేసిందని నేను భావిస్తున్నాను’’ అంటూ రాహుల్‌ గాంధీ తెలిపారు.

Latest News