సమాజం పట్ల ప్రతి ఒక్కరూ.. భాధ్యతతో పనిచేయాలి

పోలీస్ కమిషనర్ సునీల్ దత్

On
సమాజం పట్ల ప్రతి ఒక్కరూ.. భాధ్యతతో పనిచేయాలి

ఖమ్మం -ప్రభాత సూర్యుడు 

సమాజం పట్ల ప్రతి ఒక్కరూ.. భాధ్యతతో పనిచేయాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. 
ఖమ్మం జిల్లాకు ఎంపికై తొమ్మిది నెలల శిక్షణ పూర్తి చెసుకొని ఖమ్మం కమిషనరేట్ కు రిపోర్ట్ చేసిన159 మంది సివిల్ ,ఏఆర్ ట్రైనీ కానిస్టేబుళ్లతో పోలీస్ కమిషనర్ సమావేశం అయ్యారు.  పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో జరిగినన కార్యక్రమంలో

పోలీస్ కమిషనర్ సునీల్ దత్ మాట్లాడుతూ.

విద్యవంతులైన మీరందరూ చక్కని నిర్ణయంతో పోలీస్ శాఖ ను ఎంచుకొని సేవ చేసేందుకు పోలీస్ ఉద్యోగం చేరి తొమ్మిది నెలల కఠోర శిక్షణ పూర్తి చేసుకొని.. విధుల్లో చేరుతున్న కానిస్టేబుళ్లకు ముందుగా అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.WhatsApp Image 2024-11-30 at 4.31.44 PM

(శిక్షణ పూర్తి చెసుకొని ఖమ్మం కమిషనరేట్ కు రిపోర్ట్ చేసిన159 మంది సివిల్ , ఏఆర్ ట్రైనీ కానిస్టేబుళ్లు) 

నేరాల నియంత్రణ కోసం ప్రస్తుత పరిస్థితులలో అనేక సవాల్ పోలీసుల ముందు వున్నాయని గతంలో కంటే భిన్నంగా పోలిసింగ్ లో చాల మార్పులు వచ్చాయని అన్నారు. అందుకు అనుగుణంగా శిక్షణలో తర్ఫీదు పొంది వచ్చిన ట్రైనీ కానిస్టేబుళ్లు సమర్థవంతంగా ఎదుర్కోనేందుకు సిద్ధంగా వుండాలని అన్నారు.

ముఖ్యంగా పోలీస్ శాఖలో వృత్తిపరంగా, వ్యక్తిగతంగా కూడా ఎల్లప్పుడూ క్రమశిక్షణతో ఉండాలని సూచించారు. విధినిర్వహణలో ధైర్యంగా, నీతి నిజాయితీగా వ్యవహరించాలని అన్నారు. శిక్షణ సమయంలో అలవర్చుకున్న క్రమశిక్షణను రాబోయే రోజుల్లో కూడా అనుసరించాలని సూచించారు.

అప్పగించిన భాధ్యతలు ఎలాంటి ఆరోపణలు లేకుండా సక్రమంగా సద్వినియోగం చేసుకొవాలని సూచించారు. ప్రధానంగా ప్రజల రక్షణ మన భాధ్యత అని, వారి హక్కులను, ఆత్మగౌరవం భగం కలగకుండా ప్రజా సంబంధాలు మెరుగుపరుచుకోవాలని అన్నారు.

నిత్యం పని వత్తిడి, ప్రతికూల పరిస్థితులలో భాధ్యతలు నిర్వహించాల్సి వుంటుంది కాబట్టి 
మంచి ప్రవర్తనను కలిగి ప్రజలకు సేవలందించాలని సూచించారు.
శాంతి భద్రతల పరిరక్షణ కోసం నిబద్ధతతో విధులు నిర్వర్తించి పోలీసు శాఖకు కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని అకాంక్షించారు.

కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ ఆడ్మీన్ నరేష్ కుమార్, అడిషనల్ డీసీపీ లా & ఆర్డర్ ప్రసాద్ రావు, ఏసీపీ సాంబరాజు, నర్సయ్య పాల్గొన్నరు. 

Tags:

Latest News