పందెంకోడి ఏంటి? గుడ్లు పెట్టడం ఏంటి?

 కోళ్లకే కాదు గుడ్లకు డిమాండే..

On
పందెంకోడి ఏంటి? గుడ్లు పెట్టడం ఏంటి?

 

 కోళ్లకే కాదు గుడ్లకు డిమాండే

ఒంగోలు,ప్రభాత సూర్యుడ

సంక్రాంతి సవిూపిస్తోంది. కోడిపందాలకు శిబిరాలు సిద్ధమవుతున్నాయి. పందెం కోళ్ళు ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నాయి. దీంతో కోస్తాంధ్రలో సందడి నెలకొంటోంది. అక్కడా ఇక్కడా అన్న తేడా లేకుండా ఇదే సందడి నెలకొంది. పందెం కోళ్ళకే కాదు.. అవి పెట్టే గుడ్లకు కూడా భలే డిమాండ్‌. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 700 రూపాయల వరకు పలుకుతోంది ఒక్క గుడ్డు ధర. పందెంకోడి ఏంటి? గుడ్లు పెట్టడం ఏంటి? అని అనుకుంటున్నారు కదా? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివావాల్సిందే. ప్రకాశం జిల్లా తీర ప్రాంతంలోని కొత్తపట్నం, సింగరాయకొండలో గుడ్లను జాతి పెట్టలతో పొదిగించి.. పుంజులను ప్రత్యేకంగా సంరక్షిస్తుంటారు. వాటినే పందెం కోళ్ళుగా బరిలో దింపుతారు. కోస్తాంధ్రతో పాటు ఉభయగోదావరిజిల్లాల్లో కోళ్ల పందాలు జరుగుతాయి. కానీ అక్కడి పుంజులను మాత్రం అందించేది ప్రకాశం జిల్లాపందెం కోళ్లలో రకరకాల కోళ్లు ఉంటాయి. వీటిలో ప్రధానంగా తూర్పుకోడి, పెర్విన్‌ కోడి, భీమవరం కోడి, ఎర్ర మైల, అబ్రాస్‌ మైల, కాకి నెమలి, తెల్ల నెమలి, నల్లపడ కోడి, కాకి డేగ, ఎర్ర కక్కెర, తెల్ల కోడి, కాకి నెమలి, పెట్టమారు వంటి పుంజులు సంక్రాంతి బరిలో దిగుతాయి. అయితే ఈ పుంజులకు సంబంధించి పుట్టుక వెరైటీగా ఉంటుంది. నల్ల పెట్ట, డేగ పెట్ట, తెల్ల పెట్ట, బూడిద రంగు పెట్ట, అబ్రాసు పెట్ట, కక్కెర పెట్టలు పందెం కోడిపుంజులతో కలవడం ద్వారా.. గుడ్లు పెడతాయి. కానీ ఇది పొదగవు. ఈ గుడ్లను ప్రత్యేక నాటు కోళ్లతో పొదిగిస్తారు. అందుకే ఈ గుడ్డుకు అంత ధర. ఒక్కో గుడ్డు 400 నుంచి 700 వరకు విక్రయిస్తారు. డిమాండ్‌ బట్టి వీటి ధర పెరిగిపోతుంటుంది. అయితే ఈ గుడ్లు తినే కంటే.. పందెం కోళ్ళుగా తీర్చిదిద్దేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు. భరత్‌ పెరగడానికి అదే కారణం.నాటు కోళ్లతో పొదిగించే క్రమంలో.. గుడ్డు పెట్టిన తర్వాత మూడు వారాలకు పిల్ల అవుతుంది. అప్పటినుంచి రెండేళ్ల పాటు వాటికి ప్రత్యేక ఆహారం పెడతారు. సుమారు ఏడాదిన్నర పాటు రాగులు, సజ్జలు పెడుతుంటారు. తరువాత ఆరు నెలలు కాలం బాదం, ఖర్జూరం, అంజూర్‌, యాలుక, రసగుల్లా, రంగుల ద్రాక్ష, క్రిస్మస్‌, నాటు కోడి గుడ్డు వంటి బలవర్ధకమైన ఆహారాన్ని పెడతారు. కొన్నింటికి పోతు మాంసం కూడా పెడుతుంటారు. దీనిని తినడం ద్వారా పుంజు బలంగా ఉండడమే కాక బరిలో అవతలి పుంజును సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. అయితే కొత్తపట్నం, సింగరాయకొండ మండలాల్లో ఇదో కుటీర పరిశ్రమగా మారింది. కొంతమంది కోడిగుడ్లను అమ్ముకుంటూ ఉపాధి పొందుతుండగా.. మరికొందరు పందెం పుంజులను విక్రయించి జీవనం సాగిస్తున్నారు.

Views: 1
Tags:

Latest News

DELHI ELECTION UPDATE : ఢిల్లీ ఎలక్షన్స్ DELHI ELECTION UPDATE : ఢిల్లీ ఎలక్షన్స్
ఓటు వేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ఢిల్లీ - ప్రభాత సూర్యుడు ఢిల్లీ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నకల్లో దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన ఓటు హక్కును...
AP HEALTH ALRET 2025 : ఫారం కోళ్లకు అంతు చిక్కని వ్యాధి
AP NEWS UPADTE : డయాగ్నొస్టిక్ సెంటర్‌లో దారుణం.
AP Government Introduces New Guidelines :భవన నిర్మాణాలపై కొత్త మార్గదర్శకాలు
TELANGANA NEWS UPDATE 2025  :రీజనల్‌ రింగ్‌ రొడ్‌ కోసం నిధుల కసరత్తు
TG NEWS 2025:తెలంగాణ గట్టుపై ఆసక్తికర రాజకీయాలు
AP POLITICS 2025:పట్టభద్రుల ఎన్నికల్లో వలంటీర్లు