AP NEWS UPADTE : డయాగ్నొస్టిక్ సెంటర్‌లో దారుణం.

The wife who lost her life in front of her husband's eyes| The MRI that took lives| radiologist|

On
AP NEWS UPADTE : డయాగ్నొస్టిక్ సెంటర్‌లో దారుణం.

డయాగ్నొస్టిక్ సెంటర్‌లో దారుణం.. 

భర్త కళ్లెదుటే ప్రాణాలు కోల్పోయిన భార్య...

ఏలూరు- ప్రభాత సూర్యుడు

ఏలూరు సుస్మితా డయాగ్నొస్టిక్ సెంటర్‌లో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యానికి ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది.

సాధారణంగా ఎమ్మారైకి వచ్చిన వ్యక్తుల వద్ద ఎలాంటి మెటల్ వస్తువులు లేకుండా చూస్తారు సిబ్బంది. సదరు వ్యక్తి ఒంటిపై ఏదైనా మెటల్‌కు సంబంధించిన వస్తువులు ఉంటే రేడియేషన్‌ బారిన పడే అవకాశం ఉంటుంది. ఈ కారణంగా ఎమ్మారై కోసం వచ్చిన వారి ఒంటిపై ఎలాంటి వస్తువులు లేకుండా చూస్తారు డయోగ్నొస్టిక్ సిబ్బంది. కానీ ఏలూరులోని సుస్మితా డయోగ్నొస్టిక్ సెంటర్‌లో మహిళ పట్ల సిబ్బంది ప్రవర్తించిన తీరు ఇప్పుడు సంచలనంగా మారింది. స్కానింగ్ ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడంతో మహిళ ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది.

ఏలూరు రూరల్ మండలం ప్రత్తి కోళ్ళంక గ్రామానికి చెందిన నల్లగచ్చు రామతులసమ్మకు గతంలో వైద్యులు పేస్ మేకర్‌ను అమర్చారు. గత కొన్ని రోజులుగా ఆయుష్ ఆస్పత్రిలో మహిళ డయాలసిస్ చేయించుకుంటోంది. ఈ క్రమంలో రామతులసమ్మకు ఎమ్మారై తీయించుకోవాల్సిందిగా డాక్టర్ ప్రవీణ్ కుమార్‌ తెలిపారు. ఇందు కోసం ఏలూరులోని సుష్మిత డయాగ్నొస్టిక్ సెంటర్‌కు డాక్టర్ రిఫర్ చేశారు. కానీ ఇక్కడే డియాగ్నస్టిక్ సిబ్బంది చేసి తప్పిదంతో మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఎమ్మారై స్నానింగ్‌కు ముందు మెటల్ డిటెక్టర్‌తో మహిళకు చెక్‌ చేయకుండానే స్కానింగ్‌ మిషన్‌లోకి మహిళను పంపించారు ఆస్పత్రి సిబ్బంది. మిషన్‌లోకి వెళ్లిన వెంటనే రేడియేషన్ ప్రభావంతో రామతులసమ్మ కొట్టుమిట్టాడింది. చివరకు రేడియేషన్‌ ఎఫెక్ట్‌తో స్కానింగ్‌ మిషన్‌లోనే ప్రాణాలు విడిచింది మహిళ.

అయితే స్కానింగ్ మిషన్‌లో భార్య ఉక్కిబిక్కిరి అవుతున్న విషయాన్ని భర్త కోటేశ్వరరావు గుర్తించాడు. వెంటనే స్కానింగ్‌ను ఆపాలని సిబ్బందిని కోరారు. అయినప్పటికీ సదరు ఆస్పత్రి సిబ్బంది పట్టించుకోలేదు. మహిళ స్కానింగ్ మిషన్‌లో కొట్టుమిట్టాతుండగానే స్కానింగ్‌ను కొనసాగించారు. దీంతో రేడియేషన్‌ను తాళలేక మహిళ మరణించింది. ఎమ్మారై స్కానింగ్ చేస్తున్న సమయంలోనే తన భార్య తన కళ్ళ ఎదుటే మృతి చెందిందంటున్న భర్త కోటేశ్వరరావు విలపించడం అక్కడి వారిని కంటతడి పెట్టేలా చేసింది. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్షపు ధోరణిపట్ల కోటేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయాలని డయాగ్నొస్టిక్ సెంటర్ వద్ద భర్త ఆందోళనకు దిగారు. మరోవైపు ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో స్కానింగ్‌ సెంటర్‌లో మహిళ చనిపోయిన ఘటన జిల్లాలో సంచలనంగా మారింది.

Views: 2

Latest News

TG RATION CARD UPDATE :కొత్త కార్డులతో పెరిగిన బియ్యం కోట... TG RATION CARD UPDATE :కొత్త కార్డులతో పెరిగిన బియ్యం కోట...
కొత్త కార్డులతో పెరిగిన బియ్యం కోట... కరీంనగర్‌-ప్రభాత సూర్యుడు  తెలంగాణలో కొత్త రేషన్‌ కార్డులకు బియ్యం పంపిణీకి రంగం సిద్ధమైంది. గత నెలలో రాష్ట్ర వ్యాప్తంగా మండలానికి...
TELANGANA AIRLINE UPDATE 2025 :కొత్తగూడెం ఎయిర్‌ పోర్టుకు లైన్‌ క్లియర్‌
AMARAVATHI NEWS 2025 :లాయర్ కాని సుబ్రహ్మణ్యస్వామిని లాయర్‌గా తీసేసిన టీటీడీ!
DELHI ELECTION UPDATE : ఢిల్లీ ఎలక్షన్స్
AP HEALTH ALRET 2025 : ఫారం కోళ్లకు అంతు చిక్కని వ్యాధి
AP NEWS UPADTE : డయాగ్నొస్టిక్ సెంటర్‌లో దారుణం.
AP Government Introduces New Guidelines :భవన నిర్మాణాలపై కొత్త మార్గదర్శకాలు