TG NEWS 2025:తెలంగాణ గట్టుపై ఆసక్తికర రాజకీయాలు
Both in Congress and in Telangana politics
తెలంగాణ గట్టుపై ఆసక్తికర రాజకీయాలు
హైదరాబాద్-ప్రభాత సూర్యుడు
హైదరాబాద్ కేంద్రంగా.. తెలంగాణ గట్టు విూద ఇంట్రెస్టింగ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఇష్యూ ఏదైనా..టాపిక్ మరేదైనా పీక్‌లెవల్ పొలిటికల్ హీట్‌ను క్రియేట్ చేస్తోంది. రేపే ఎన్నికలు ఉన్నాయన్నంతగా అటు కాంగ్రెస్, ఇటు బీఆర్‌ఎస్ ఏ మాత్రం తగ్గడం లేదు. సరిగ్గా ఇదే టైమ్‌లో గులాబీ బాస్ కేసీఆర్ సడెన్ ఎంట్రీ ఇచ్చారు.అంతేకాదు తాను కొడతే మామూలుగా ఉండదంటూ..కాంగ్రెస్ సర్కార్‌కు వార్నింగ్ ఇచ్చారు. ఆయన మాటలు ఓ వైపు ప్రకంపనలు రేపుతుండగానే..మరోవైపు హస్తం పార్టీ ఎమ్మెల్యేల సీక్రెట్ విూటింగ్ అంటూ వార్త తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు.. సీక్రెట్ విూటింగ్ పెట్టుకున్నారంటూ న్యూస్ చక్కర్లు కొడుతుండటంతో టీపాలిటిక్స్‌లో హైవోల్టేజ్ హీట్ కనిపిస్తోంది.కేసీఆర్ అసెంబ్లీకి రావాలి..సర్కార్‌కు సలహాలు ఇవ్వాలంటూ..సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఎన్నిసార్లు రెచ్చగొట్టినా..ఫామ్‌హౌస్‌కే పరిమితం అయిన గులాబీ బాస్ కేసీఆర్..శుక్రవారం రోజు ఎంటర్ దీ డ్రాగన్ అంటూ హాట్ కామెంట్స్‌తో న్యూస్ మేకర్ అయ్యారు. తాను కొడితే మామూలుగా ఉండదంటూ రేవంత్ సర్కార్‌కు మాస్ వార్నింగ్ ఇచ్చారు.ఇలా కేసీఆర్ మాస్ వార్నింగ్ ఇచ్చారో..? లేదో..? మూడు గంటలైనా గడవక ముందే..కాంగ్రెస్ ఎమ్మెల్యేల సీక్రెట్ విూటింగ్ అంటూ ఓ వార్త బయటికి వచ్చింది. ఇద్దరు మంత్రుల తీరుపై..అసంతృప్తిగా ఉన్న కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రహస్య విూటింగ్ పెట్టుకునారన్న వార్త..రేవంత్ సర్కార్‌లో ఒక్కసారిగా కలవరానికి దారి తీస్తే..గులాబీ శిబిరంలో మాత్రం ఉత్సాహం నింపుతోందట.సీక్రెట్ భేటీ అంటూ జరుగుతున్న ప్రచారంపై సదరు ఎమ్మెల్యేలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. విూటింగ్ లేదు..గీటింగ్ లేదంటూ చెప్పుకొస్తున్నారు. అంతేకాదు ఇదంతా కేసీఆర్ కుట్ర అంటూ మరో కోణాన్ని తెరవిూదకు తెచ్చారు. అక్కడితో ఆగకుండా బీఆర్‌ఎస్ సోషల్ విూడియాపై ఫిర్యాదు చేశారు.ఇదంతా బయటికి బాగానే ఉన్నా..దాల్ మే కుఛ్ తో కాలా హై..అన్న గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా ఉన్నప్పటికీ..ఏ ఒక్క పని కావడం లేదని ఆవేదనలో హస్తం పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారట. ముఖ్యంగా బిల్లులు ఇవ్వడం లేదని అమాత్యుల దృష్టికి తీసుకెళ్తే పెద్దగా పట్టించుకోవడం లేదట. ఇప్పటివరకు నాలుగు గోడల మధ్య వ్యక్తం చేస్తున్న వాళ్ల గోడే..సీక్రెట్ విూటింగ్ వరకు వెళ్ళిందన్న చర్చ బలంగా వినిపిస్తుంది.ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన ఒక యువ ఎమ్మెల్యే..కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో భేటీని ఆర్గనైజ్ చేశారట. సదరు ఎమ్మెల్యే తన ఫామ్‌హౌస్‌లో డిన్నర్ ఏర్పాటు చేసి సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను ఆహ్వానించారట. దాదాపు పది మంది ఎమ్మెల్యేలు డిన్నర్ సమావేశానికి వెళ్లినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ భేటీలో ప్రధానంగా.. తమ ఎదురవుతున్న ఇబ్బందులపైనే చర్చించారట.డిన్నర్‌కు పిలిచిన ఎమ్మెల్యే మొదట తన నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితులు..అందుకు ఒకరిద్దరు మంత్రులు పెడుతున్న ఇబ్బందులను ప్రస్తావించారట. ఒక కీలక మంత్రి తనను సతాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారట. డిన్నర్‌కు అటెండ్ అయిన మిగత ఎమ్మెల్యేలు కూడా ఆయనతో కోరస్ కలిపారట. తమ పరిస్థితులను వివరించుకుంటూ గోడు వెళ్లబోసుకున్నారట.చాలామంది మంత్రులు అసలు ఎమ్మెల్యేలకు టైమ్ ఇవ్వడం లేదని సమావేశంలో చర్చించుకున్నారట. 11 మంది మంత్రులలో.. సగానికి పైగా మంత్రులు ఎమ్మెల్యేలకు కనీస గౌరవం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారట. కొందరు మంత్రులు అయితే కనీసం ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదని ఫ్రస్ట్రేట్ అయ్యారట ఎమ్మెల్యేలు. కొందరు మినిస్టర్లు గంటలకొద్దీ బయట వెయిట్ చేయిస్తున్నారని..ఇంకొందరు మంత్రులు తమ నియోజకవర్గంలో వ్యతిరేక శక్తులను ప్రోత్సహిస్తున్నారంటూ అగ్గివిూద గుగ్గీలం అయ్యారట ఎమ్మెల్యేలు. ఇలా ఎమ్మెల్యేల సమావేశం..డిన్నర్ భేటీ కాస్త..సీక్రెట్ విూటింగ్ అని ప్రచారం జరిగిందట.మంత్రుల తీరుపై ఇప్పటికే ఒకసారి ఫిర్యాదు చేసినా వారిలో ఏమాత్రం మార్పు రావడం లేదని ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేశారట. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ మందలించినా మంత్రుల్లో మార్పు రావడం లేదట. అమాత్యులు తమ వ్యక్తిగత పనులపై ఫోకస్ పెట్టుకుంటే..పార్టీ తీవ్రంగా నష్టపోతుందని కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు అంతా భావిస్తున్నారట. ఈ పరిణామాలన్నింటినీ సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారట. ఇదే విషయం బయటకు లీక్ అయిందంటున్నారు.కాస్త రహస్య సమావేశమని.. అటు కాంగ్రెస్‌లో..ఇటు తెలంగాణ పాలిటిక్స్‌లో హీట్ క్రియేట్ చేస్తోంది. ఇలా కాంగ్రెస్ ఎమ్మెల్యేల ప్రత్యేక డిన్నర్ భేటీ..తెలంగాణ పాలిటిక్స్ లో చర్చనీయాంశంగా మారింది. పైకి సీక్రెట్ విూటింగ్ లేదు..ఏవిూ లేదని అంటున్నా దాల్ మే కుచ్ కాలా హై అన్న చర్చ అయితే జరుగుతోంది. నిజంగానే ఎమ్మెల్యేలు రహస్య భేటీ అయ్యారా లేక దీని వెనుక ఇంకేమైన మతలబు ఉందా అనేది వేచి చూడాలి మరి.