ఏడు లక్షల మంది ఆత్మహత్యలా..?
చదువుకునే రోజులు పోయాయి.. చదువుకొనే రోజులు ఎప్పుడో వచ్చాయి
ప్రభాత సూర్యుడు విశ్లేషణ
విద్య ఎప్పుడో వ్యాపారంగా మారింది. తమ పిల్లలను ఉన్నతంగా చదివించాలని, మంచి ర్యాంకు సాధించాలన్న తల్లిదండ్రుల ఆరాటమే కార్పొరేట్ కాలేజీలకు పెట్టుబడిగా మారింది. విద్యా వ్యాపారాన్ని పెంచి పోషిస్తోంది. ఈ ఇరువురి ఆటలో విద్యార్థులు సమిధలవుతున్నారు. చదువుకునే రోజులు పోయాయి.. చదువుకొనే రోజులు ఎప్పుడో వచ్చాయి. సౌకర్యాలు.. ర్యాంకులు, అనుభవం కలిగిన అధ్యాపకులను సాకుగా చూపి.. ఇష్టానుసారంగా కాలేజీలు ఓపెన్ చేస్తున్నాయి కార్పొరేట్ సంస్థలు. ఇందులో అడ్మిషన్ల పేరుతో లక్షల రూపాయలు ఫీజులు తీసుకుంటున్నాయి. తల్లిదండ్రులు కూడా కార్పొరేట్ కాలుజీలో చేర్పిస్తే తమ పిల్లల భవిష్యత్ బాగుంటుందని భావిస్తున్నారు. ఇదే ఆరాటాన్ని కార్పొరేట్ విద్యా సంస్థలు తమకు పెట్టుబడిగా మార్పుకుంటూ విద్యా వాప్యారాన్ని విస్తరిస్తున్నాయి. అందినకాడికి దోచుకుంటున్నాయి. మరోవైపు ఫీజులు తీసుకున్నాం కాబట్టి విద్యార్థుల సామర్థ్యానికి మించి చదువులపై ఒత్తిడి చేస్తున్నారు. తిట్టడం, కొట్టడం, అవమానించడం లాంటి ఘటనలు నిత్య కృత్యమయ్యాయి. ఇటు తల్లిదండ్రులకు ఏవిూ చెప్పుకోలేక.. అటు చదవలేక విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిలో ఎక్కువ మంది నీట్‌కు సిద్ధమవుతున్న విద్యార్థలు ఉంటున్నట్లు ఒక పరిశీలనలో తేలింది. గణాంకాల ప్రకారం, చదువుకుంటోన్న విద్యార్థుల వయసు 15 నుంచి 17 ఏళ్ల మధ్య ఉంటుంది. ఈ నగరంలో తమ తల్లిదండ్రుల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఒంటరిగా జీవించడం అంత తేలికైన విషయం కాదు. రోజూ కనీసం 13 నుంచి 14 గంటల పాటు చదువుకోవాల్సి ఉంటుంది. టాపర్లతో తీవ్రమైన పోటీ ఉంటుంది. ఇది విద్యార్థులను మరింత ఒత్తిడికి గురి చేస్తుంది. ప్రభుత్వ డేటా ప్రకారం, 2021 ఏడాదిలో భారత్‌లో 13 వేల మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
2020 గణాంకాలతో పోలిస్తే, ఈ గణాంకాలు 4.5 శాతం ఎక్కువ. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న వివరాల ప్రకారం, ప్రతి సంవత్సరం సుమారు 7 లక్షల మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు.15 నుంచి 29 ఏళ్ల మధ్య వయసు ఉండి చనిపోతున్న వారిలో ఆత్మహత్య నాలుగో ప్రధాన కారణంగా ఉంటోంది. పది రోజుల వ్యవధిలో ముగ్గురు విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇక కట్టడి చేయాల్సిన పాలకులు, అధికారులు చోద్యం చూస్తున్నారు. బీబీనగర్ మండలం పెద్దపలుగు తండాకు చెందిన భానోత్ తనూష్‌నాయక్ తల్లిదండ్రులు నగరానికి వలస వచ్చారు. కుషాయిగూడలో నివాసం ఉంటున్నారు. అన్నోజిగూడలోని నారాయణ జూనియర్ కలేజీలో తనుష్‌ను ఇంటర్ (ఎంపీసీ) ఫస్ట్ ఇయర్ లో చేర్పించారు. హాస్టల్ బాత్‌రూంలోకి వెళ్లి ఎంతసేపటికీ బయటకు రాలేదు. దీంతో విద్యార్థులు తలుపులు పగుల గొట్టి లోనికి వెళ్లి చూడగా ఉరికి వేలాడుతూ కనిపించాడు. సిబ్బంది వెంటనే తనుష్‌ను ఆస్పత్రికి తరలించారు. పరిశీలింన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. తనుష్ ఫిట్స్‌తో చనిపోయాడని యాజమాన్యం బుకాయిస్తోంది. ఒత్తిడి కారణంగానే ఆత్మహత్య చేసుకున్నాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం చిన్న తండాకు చెందిన ప్రజ్ఞారెడ్డి ప్రగతినగర్‌లోని ఎన్‌ఎస్‌ఆర్ ఇంపల్స్ ఐఐటీ గల్స్ క్యాంపస్‌లో ఎంపీసీ సెకండియర్ చదువుతోంది. కళాశాల హాస్టల్‌లో ఉంటోంది. సోమవారం ఉదయం 9:30 గంటలకు తాను ఉంటున్న హాస్టల్‌లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుంది. యాజమాన్యం విషయం దాచి మతదేహాన్ని హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తరలించింది. ప్రజ్ఞరెడ్డి మతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకుందా లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.జిల్లా కోదాడలోని స్నేహ నర్సింగ్ కళాశాలలో అసోం రాష్ట్రానికి చెందిన నర్గీస్ పర్వీన్ బీఎస్సీ సెకండియర్ చదువుతోంది. కాలేజీ ఫీజు చెల్లింపు ఆలస్యమైంది. దీంతో యాజమాన్యం విద్యార్థినిపై ఫీజు కోసం ఒత్తిడి చేసింది. దీంతోకాలేజీ హాస్టల్‌లోని తన గదిలో శానిటైజర్ తాగింది. గమనించిన సహచర విద్యార్థులు సూర్యపేట ఆస్పత్రికి తరలించగా కోలుకుంటోంది. స్మార్ట్‌ఫోన్లు ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతుల్లో ఉంటున్నాయి. కొంతమంది పిల్లలు వాటిని దుర్వినియోగం చేస్తున్నారు. ఇంటర్నెట్‌కు బానిసలుగా మారుతున్నారు.దీని వల్ల, కొందరు క్లాస్‌లకు బంక్ కొడుతున్నారు. దీంతో ఇతర పిల్లలతో పోలిస్తే వెనుకబడి పోతున్నారు. పిల్లలు వెనుకబడిపోయినప్పుడు డిప్రెషన్‌లో కూరుకుపోతున్నారు. ఆ తర్వాత ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.ఇక్కడ కోచింగ్ చాలా వేగంగా ఇస్తారు. ఒకవేళ ఒకటి లేదా రెండు మూడు రోజులు క్లాస్‌లకు వెళ్లకపోయినా, కోచింగ్ ఇన్‌స్టిట్యూట్లు చెబుతున్న పాఠాలను వారు అందుకోలేకపోతారు.’’ సైకియాట్రిస్ట్ డాక్టర్ ఎంఎల్ అగర్వాల్ చెప్పారు. 200 నుంచి 300 వరకు విద్యార్థులున్న క్లాస్‌లు ఒకసారి వెనుకబడితే, ఆ సిలంబస్‌ను అందుకోవడం అంత తేలికైన విషయం కాదు.దీంతో మానసిక ఒత్తిడి తీవ్రంగా పెరిగిపోతుంది. ఈ ప్రభావం టెస్ట్‌లపై కనిపిస్తోంది. ఇది విద్యార్థులలో మరింత ఒత్తిడిని పెంచుతోంది.నిపుణలు చెబుతున్న ప్రకారం, కోటాలో చదువుకుంటోన్న చాలా మంది విద్యార్థుల వయసు 15 నుంచి 17 ఏళ్ల మధ్యలో ఉంటుంది. వారి జీవితాల్లో ఇది చాలా కీలకమైన సమయం. కానీ, వాస్తవంగా వారింకా పిల్లలే.పిల్లలు ఇక్కడికి వచ్చే సమయం, శారీరకంగా, మానసికంగా అభివృద్ధి చెందే దశ. హార్మోనల్ మార్పులు కూడా అప్పుడే వస్తాయి’’ అని డాక్టర్ ఎంఎల్ అగర్వాల్ చెప్పారు. పిల్లల మనస్సులో ఏముందో తల్లిదండ్రులు తెలుసుకుంటూ ఉండాలి. వారితో ఎక్కువ సేపు గడపాలి, మాట్లాడాలి. దీంతో పిల్లలు వారి మనస్సులోని భావనలను బయటికి చెబుతారు’’ అని నిపుణులు సూచించారు.