Nalgonda News : ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి.

ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి.
చిలుకూరు - ప్రభాత సూర్యుడు
మండల కేంద్రంలోని చేన్నారి గూడెం గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ కార్యదర్శి వెలిశాల శౌరిక పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి శుభాకాంక్షలు తెలియజేశారు. గ్రామపంచాయతీ ఆవరణలో దళిత సంఘాలను, దళిత నాయకులను అభినందించడం జరిగింది. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూల మాలలు వేసి శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో వివిధ రాజకీయ పార్టీ నాయకులు,గ్రామ దళిత మహిళలు, మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పెండ్రాతి హనుమంతరావు, మాజీ సర్పంచులు కొవ్వూరు ఓబయ్య ,కమతం కొండలు , గంటా శ్రీనివాసరావు, పుట్టపాక నరసయ్య, మాజీ ఉప సర్పంచ్ మాతంగి నాగేశ్వరరావు, వార్డు మెంబర్లు, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.