Hyderabad Rains : హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం
కొన్నిచోట్ల వడగళ్ల వర్షంతో ఈదురుగాలులు , పలుచోట్ల కూలిన చెట్లు..ట్రాఫిక్‌కు అంతరాయం, నగరంపై క్ములోనింబస్ మేఘాలు ఆవరణ

- కొన్నిచోట్ల వడగళ్ల వర్షంతో ఈదురుగాలులు
- పలుచోట్ల కూలిన చెట్లు..ట్రాఫిక్‌కు అంతరాయం
- నగరంపై క్ములోనింబస్ మేఘాలు ఆవరణ
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం
- కొన్నిచోట్ల వడగళ్ల వర్షంతో ఈదురుగాలులు
- పలుచోట్ల కూలిన చెట్లు..ట్రాఫిక్‌కు అంతరాయం
- నగరంపై క్ములోనింబస్ మేఘాలు ఆవరణ
హైదరాబాద్ - ప్రభాత సూర్యుడు
హైదరాబాద్ నగర పరిధిలో పలు ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం వర్షం కురిసింది. ఎస్‌ఆర్‌నగర్, బోరబండ, అవిూర్‌పేట, పంజాగుట్ట, మధురానగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కోఠి, సుల్తాన్‌బజార్, బేగంబజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్‌బాగ్, హిమాయత్‌నగర్, నారాయణగూడలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడిరది. మెహదీపట్నం, మాసబ్‌ట్యాంక్, కార్వాన్, బోయినపల్లి, తిరుమలగిరి, అల్వాల్, మారేడ్‌పల్లితో పాటు- కుత్బుల్లాపూర్ పరిసరాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుంది. గుండ్లపోచంపల్లి, దుండిగల్, దూలపల్లి, బహదూర్‌పల్లి, మియాపూర్, నానక్‌రామ్‌గూడలో వానపడుతున్నది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, చైతన్యపురి, దిల్‌షుఖ్‌నగర్, మియాపూర్, గచ్చిబౌలి, వనస్థలీపురం తదితర ప్రాంతాల్లో వానకురిసింది.
గాంధీ భవన్ ప్రాంతంలో భారీ చెట్టు నేలకూలింది. చంపాపేట, సైదాబాద్, సరూర్‌నగర్‌తో ఈదురుగాలులతో కూడిన వర్షం పడిరది. వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో కరెంటు సరఫరా నిలిచిపోయింది. మరో వైపు వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులుపడ్డారు. ట్రాఫిక్ అంతరాయం ఏర్పడిరది. హైదరాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నాంపల్లి రెడ్‌హిల్స్‌లో రోడ్డుపై ఓ భారీ వృక్షం కూలిపోయి ట్రాన్స్‌ఫార్మర్‌పై పడిరది. దీంతో అది ఒక్కసారిగా పేలిపోయింది. అస్మాన్‌గఢ్ విద్యుత్ డివిజన్ పరిధిలో 67 ఫీడర్లు ట్రిప్ అయ్యాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ పనుల్లో జాప్యం చోటు- చేసుకుంది. బషీర్‌బాగ్‌లో పీజీ లా కాలేజ్ ఎదుట రోడ్డుపై ఓ చెట్టు కూలిపోయింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ట్యాంక్ బండ్ నుంచి లోయర్ ట్యాంక్‌బండ్ వెళ్లే రోడ్డులో చెట్టు- కూలిపోయి.. వాహనాలు భారీగా నిలిచిపోయాయి. లంగర్ హౌస్ బాపునగర్ కాలనీలో చెట్టు కూలి.. రెండు విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. వర్షానికి భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. కొన్ని చోట్ల గాలి వానకు చెట్లు విరిగిపడ్డాయి.దీంతో రోడ్డు మార్గాన వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ , ఖైరతాబాద్, లక్డీకపూల్, పంజాగుట్ట, సికింద్రాబాద్,కూకట్ పల్లి, బషీర్ బాగ్, అల్వాల్, బాల్ నగర్ , ఎరియాల్లో గాలి దుమారం, రాళ్ళ వాన పడిరది. గచ్చిబౌలి, హైటెక్ సిటీ-, కొండాపూర్, భారీ వర్షానికి ఎక్కడిక్కడ నీళ్లు నిలిచిపోయాయి. భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. కిలోవిూటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఒక్కసారిగా మారిన వాతావరణంతో పలు చోట్ల గాలి వాన కురిసింది. నగరంపై క్యుములో నింబస్ మేఘాలు ఆవరించాయి. సాయంత్రం 5 గంటల వరకు ఎండగా ఉన్న వాతావరణం.. ఒక్కసారిగా మారిపోయింది. చిమ్మ చీకట్లు అలుముకున్నాయి. దట్టమైన మేఘాలతో పగలే చీకట్లు అన్నట్లుగా వాతావరణం మారిపోయింది.