Chiranjeevi : నిజ, సినీ జీవితంలో వారి పాత్ర మరువలేను

ట్విటర్లో మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన చిరు

On
Chiranjeevi : నిజ, సినీ జీవితంలో వారి పాత్ర మరువలేను

తనతో కలిసి నటించిన హీరోయిన్ లతో చిరంజీవి, భార్య సురేఖ

నిజ, సినీ జీవితంలో వారి పాత్ర మరువలేను

-మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన చిరు

హైదరాబాద్‌ - ప్రభాత సూర్యుడు

మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని చిరంజీవి తన సినీ జీవితంలో భాస్గవాములుగా ఉన్న హీరోయిన్‌లకు, నిజజీవితంలో అసలు హీరోయిన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా మెగా ఉమెన్స్‌ పేరుతో స్పెషల్‌ ఇంటర్వ్యూ విడుదలైంది. అమ్మ అంజనాదేవి, సోదరీమణులు, సోదరుడు నాగబాబుతో చిరంజీవి ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తన జీవితానికి సంబంధించి ఎన్నో విశేషాలు పంచుకున్నారు. చిన్నతనం నుంచి మా తల్లిదండ్రులు మాకు స్వేచ్ఛను ఇచ్చారు. సినిమాల్లోకి వెళ్తానంటే కాస్త భయపడినప్పటికీ కాదని మాత్రం చెప్పలేదు. వాళ్లు ఇచ్చిన స్వేచ్ఛ వల్లే మరింత బాధ్యతాయుతంగా ముందుకుసాగాను. షూటింగ్స్‌లో అలసిపోయి వచ్చినప్పుడు నాన్న నాకెంతో సపోర్ట్‌గా ఉండేవారు. అమ్మలా నన్ను చేరదీసేవారు. ’గూండా’ షూటింగ్‌ సమయంలో  ట్రైన్‌ సీక్వెన్స్‌ చేస్తున్నప్పుడు నాన్న అక్కడే ఉన్నారు. షూట్‌ పూర్తికాగానే నాపై కోప్పడ్డారు. ’ఎందుకు ఇలాంటివి అన్నీ చేస్తుంటావ్‌’ అని కేకలు వేశారు. మరేం ఫర్వాలేదని నేను నచ్చజెప్పినప్పటికీ.. ’రేపు నీకొక కొడుకు పుట్టి.. వాడు ఇలాంటివి చేస్తుంటే నా భయం ఏమిటో నీకు తెలుస్తుంది’ అనేవారు. ’మగధీర’ షూట్‌లో గుర్రంపై నుంచి చరణ్‌ పడిపోయాడు అని విన్నప్పుడు.. ఆ రోజుల్లో నాన్న నా విషయంలో ఏవిధంగా ఫీలయ్యారో మొదటిసారి నాకు చరణ్‌ విషయంలో అలాంటి కంగారు వచ్చింది. ఆ సినిమా చిత్రీకరణ సమయంలో పీటర్‌ హెయిన్స్‌ ఒక స్టంట్‌ చేస్తూ కిందపడిపోతే ఏడెనిమిది నెలల పాటు ఆస్పత్రిలోనే ఉన్నాడు. చరణ్‌కు ఏమవుతుందోనని నేనెంతో భయపడ్డాను.  తన సినీ జీవితంలో ఎందరో హీరోయిన్ల కారణంగా తన పాత్రలకు ప్రతిభ వచ్చిందన్నారు. వారికి తాను కృతజ్ఞుడనని, వారికి ప్రత్యేకంగా విమెన్స్‌ డే శుభాకాంక్షలు తెలిపారు.WhatsApp Image 2025-03-08 at 1.34.57 PM

Views: 201

Latest News