CPI Narayana : ట్రంప్ బెదరింపులతో భయమేస్తుంది
ట్రంప్ బెదరింపులపై మోడీ స్పందించాలి , మోడీతో చంద్రబాబు మాట్లాడాలి
.jpg)
అమెరికా పరిణామాలతో ఆందోళన
- ట్రంప్ బెదరింపులపై మోడీ స్పందించాలి
- మోడీతో చంద్రబాబు మాట్లాడాలి
- విూడియా సమావేశంలో సిపిఐ కార్యదర్శి నారాయణ
హైదరాబాద్ - ప్రభాత సూర్యుడు
ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయ్యాక భారతీయులకు రక్షణ లేకుండా పోయిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. అమెరికాలో తాజా పరిస్థితిపై ఆయన విూడియాతో మాట్లాడారు. ‘మోడీ వివిధ దేశాల అధినేతలతో సమావేశాలకే పరిమితం అవుతున్నారు.. ప్రపంచంలో అత్యంత శక్తి వంతమైన దేశంగా ఉన్న అమెరికా బెదిరింపులకు దిగడం సరికాదు.. ఇతర దేశాల సంపదను కొల్ల గొట్టేందుకు అమెరికా ప్రయత్నం చేస్తుంది.. ఎలాన్ మాస్క్ తో డిబేట్ సందర్బంగా వీధి రౌడీ లాగ ట్రంప్ ప్రవర్తన ఉంది.. ప్రపంచ వ్యాప్తంగా ట్రంప్ కు వస్తున్న వ్యతిరేతను భారత్ తరుపున మోడీ ఉపయోగించుకోవాలి.. లేదంటే వంద కోట్ల భారతియుల ప్రయోజనాలను అమెరికా కు తాకట్లు పెట్టినట్లు అవుతుందని నారాయణ అన్నారు. ప్రపంచ పెట్టుబడి దారులంతా ఏకం అయ్యే ప్రమాదం ఉంది.. దీనివిూద చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పి..మోడీతో ట్రంప్ కు చెప్పించే బాధ్యత చంద్రబాబు తీసుకోవాలని నారాయణ వ్యాఖ్యానించారు.
అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులను అక్కడి ప్రభుత్వం వెనక్కి పంపిస్తోంది. ఇప్పటికే మిలిటరీ విమానంలో వందలాది మంది భారతీయులకు తిరిగి పంపించింది. ఈ అంశంపై ఇప్పటికే ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. భారత విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ.. ఈ అంశంపై స్పందించారు. అక్రమ మార్గాల ద్వారా దేశంలోకి ప్రవేశించిన వారిని తొలుత అమెరికా తిప్పి పంపిందన్నారు. వారంతా అమెరికా భద్రతకు ముప్పుగా పరిణమించారని అక్కడి ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు.