Nara Lokesh vs Pawan Kalyan : పవన్‌ కళ్యాణ్‌ శాఖలో లోకేష్‌ జోక్యం

ఈ పరిణామం జరగడంతో ఏపీ రాజకీయాలు కొత్త రచ్చ

On
Nara Lokesh vs Pawan Kalyan : పవన్‌ కళ్యాణ్‌ శాఖలో లోకేష్‌ జోక్యం

పవన్‌ కళ్యాణ్‌ శాఖలో లోకేష్‌ చొరవ

విజయవాడ - ప్రభాత సూర్యుడు 

నారా లోకేష్‌ క్షమాపణ చెప్పారు. నల్లమల లోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం కాశీనాయన సత్రాన్ని అటవీ అధికారులు కూల్చేశారు. నిరంతర అన్నదానం జరిగే కట్టడాలు కూడా ఇందులో ఉన్నాయి. టైగర్‌ జోన్‌  ఏర్పాటు, అటవీ శాఖ నిబంధనల వల్ల ఫారెస్ట్‌ అధికారులు నల్లమల అటవీ ప్రాంతంలోని కాశీనాయన ఆశ్రమాన్ని కూల్చేశారు. దీనిపైనే నారా లోకేష్‌ క్షమాపణ చెబుతూ ప్రజల మనోభావాల్ని విజ్ఞప్తులను అధికారులు దృష్టిలో పెట్టుకుని ఉంటే బాగుండేదని.. ఈ ఘటన కు కారణమైన అధికారులపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. అలాగే కూల్చేసిన కట్టడాలని  తిరిగి తాను నిర్మిస్తానని భక్తులకు హావిూకు ఇచ్చారు. నారా లోకేష్‌ ప్రకటన భక్తులకు ఊరట కలిగించిన మాట వాస్తవమే కానీ ఆ శాఖ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ కి చెందింది కావడం విశేషం. అటవీ శాఖ బాధ్యతలు ప్రస్తుతం ఆయన నిర్వహిస్తున్నారు. కాశీనాయన కట్టడాలని కూల్చేయొద్దు అంటూ  పవన్‌ కళ్యాణ్‌ కి ఇప్పటికే చాలా వినతులు అందాయి. కానీ ఆయన నుండి స్పందన రాలేదు. ఇప్పుడు విద్యా, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్‌ ఎంటర్‌ కావడం తో భక్తులకు ఊరట కలిగింది. కానీ ఇలా జనసేనకు చెందిన మంత్రిత్వ శాఖలో నారా లోకేష్‌ ఎంట్రీ ఇవ్వడం ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. గతంలో హోంశాఖ బాధ్యతలు టిడిపి సరిగా నిర్వహించడం లేదంటూ  హోం మంత్రి అనితను  పవన్‌ కళ్యాణ్‌ బహిరంగంగానే విమర్శించిన ఘటన  ఇంకా ఎవరూ మరువలేదు.

తాను గనుక హోంశాఖ తీసుకుంటే పరిస్థితి వేరేలా ఉంటుందని కూడా పవన్‌ కళ్యాణ్‌ అప్పట్లో ప్రత్యర్థులకు వార్నింగ్‌ ఇచ్చారు. కానీ ఇలా వేరే మంత్రిత్వ శాఖ  గురించి బహిరంగంగా పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడడం పై అప్పట్లో పెద్ద చర్చే జరిగింది. ఇప్పుడు ఆయనకు సంబంధించిన శాఖలో నారా లోకేష్‌ ఎంట్రీ ఇవ్వడంపై  అది కూడా  జనసేన ప్లీనరీకి ఒక్కరోజు ముందు ఈ పరిణామం జరగడంతో ఏపీ రాజకీయాలు కొత్త చర్చ మొదలైంది.  కానీ ఇంత ముఖ్యమైన విషయంలో  పవన్‌ కళ్యాణ్‌ ఎందుకు స్పందించలేదు అనేది  కాశీనాయన భక్తులకు అర్థం కావడం లేదు.

ఉమ్మడి నెల్లూరు జిల్లా  బెడుసుపల్లిలో  1895లో పుట్టిన కాశీ రెడ్డి బాల్యంలోనే ఆధ్యాత్మిక చింతనలో పడ్డారు. దేశంలోని అనేక  తీర్థాలు పుణ్యక్షేత్రాలు సందర్శించి  కాశి నాయనగా మారారు. ఆయన పేరు విూద  రాష్ట్రంలో అనేక ఆశ్రమాలు వెలసాయి. కడప జిల్లాలోని బద్వేలు సవిూపంలో  ఉన్న ఆశ్రమం అతి ముఖ్యమైనది. ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతూ ఉంటుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు తాను బతికి ఉండగానే కాశి నాయన 104 ఏళ్ల వయస్సు లో 1999లో దేహం చాలించారు. ఆయన పేరు విూద అప్పటి ప్రభుత్వం ఒక మండలాన్ని కూడా ఏర్పాటు చేసింది. రాయలసీమ ప్రాంతంలో కాశీనాయనకు ఎంతో మంది భక్తులు ఉన్నారు. ఇప్పుడు అటవీ నిబంధనల పేరుతో  ఆయన ఆశ్రమాన్ని అన్నదాన సత్రాన్ని  అటవీ అధికారులు కూల్చేయడం పై ఆందోళన మొదలైంది. ప్రస్తుతం లోకేష్‌ ఎంట్రీ ఇవ్వడంతో  ఆ ఆందోళన సద్దుమణిగినా అది పవన్‌ కళ్యాణ్‌ కు చెందిన శాఖ కావడంతో జనసేన దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి అంటున్నారు రాజకీయ పరిశీలకులు.

Views: 24

Latest News