Kumb Girl Monalisa : సినిమాలో హిరోయిన్ చాన్స్ అని దారుణంగా మోసం
Maha Kumbhmela Viral Girl Monalisa Bhosle in Trouble | Viral Girl Monasila in Danger Situation
.jpg)
చిక్కుల్లో మొనాలిసా
ముంబై - ప్రభాత సూర్యుడు
యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా జరుగుతోంది. ఈ కుంభమేళాకు వచ్చిన చాలామంది సామాన్యులు ఓవర్‌నైట్‌లోనే వైరల్‌గా మారారు. అలా వచ్చి సెలబ్రిటీగా మారిపోయింది మోనాలిసా. కుంభమేళాలో పూసల దండలు అమ్ముకునేందుకు వచ్చిన మోనాలిసా ఒక్కసారిగా నెట్టింట వైరల్ అయిపోయింది. ఈ నీలికళ్ల సుందరి ఓవర్ నైట్‌లోని సోషల్ విూడియా క్వీన్‌గా మారింది. ఆమె ఫోటోలు, వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు కొట్టాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ఈమె రిస్క్‌లో పడ్డట్టు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఇటీవల మోనాలిసా క్లారిటీ ఇచ్చింది.కుంభమేళా మోనాలిసాను చూసిన డైరక్టర్ సనోజ్ మిశ్రా ఆమె ఇంటికి వచ్చి సినిమా ఆఫర్ ఇచ్చారు. ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’ పేరుతో ఓ సినిమా చేస్తున్నానని.. అందులో కుంభమేళా మోనాలిసా హీరోయిన్‌గా నటిస్తోందని తెలిపాడు. ఇది విన్న వారంతా ఓవర్ నైట్‌లోనే మోనాలిసా దశ తిరిగిపోయిందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఈ తరుణంలో ఆమె న్యూ లుక్‌లో దిగిన ఫోటోలు బయటకు వచ్చాయి. అలాగే తాజాగా మోనాలిసా ఓ బ్రాండ్ ప్రమోషనల్ ఈవెంట్‌కు హాజరయ్యింది. ఇదిలా ఉంటే.. తాజాగా నిర్మాత జితేంద్ర నారాయణ్ మోనాలిసా రిస్క్‌లో ఉన్నట్టు చెప్పాడు. మోనాలిసా దర్శకుడు సనోజ్ మిశ్రా ట్రాప్‌లో పడిరదని ఆరోపించాడు. అతడి దగ్గర సినిమాను నిర్మించేందుకు సరిపడా డబ్బులు లేవని, ఫేమ్ కోసమే అతడు మోనాలిసాను తిప్పుకుంటున్నాడని ఘాటైన వ్యాఖ్యలు చేశాడు. ఇక తాజాగా వీటిపై మోనాలిసా క్లారిటీ ఇచ్చింది. సనోజ్ మిశ్రాపై వస్తున్నా వార్తల్లో నిజం లేదని.. అవన్నీ వట్టి పుకార్లేనని కొట్టిపారేసింది. తానెవ్వరి ట్రాప్‌లో పడలేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం తను మధ్యప్రదేశ్‌లోని యాక్టింగ్ స్కూల్‌లో నటన నేర్చుకుంటున్నానని.. తనతో తన కుటుంబం కూడా ఉందని స్పష్టం చేసింది. సనోజ్ ఎప్పుడూ తనను కూతురులా చూసుకుంటారని.. ఆయన చాలా మంచి మనిషి అని చెప్పుకొచ్చింది కుంభమేళా మోనాలిసా.