TPL : క్రికెట్ అభిమానులకు శుభవార్త
తెలంగాణ ప్రీమియర్ లీగ్ వచ్చేస్తోంది

తెలంగాణ ప్రీమియర్ లీగ్ వచ్చేస్తోంది
-హైదరాబాద్‌లో కొత్త క్రికెట్ స్టేడియానికి అడుగులు
-150 ఎకరాల్లో స్టేడియం నిర్మాణం
స్పోట్స్ డెస్క్ - ప్రభాత సూర్యుడు
హైదరాబాద్‌లో కొత్త క్రికెట్ స్టేడియాన్ని నిర్మించాలనుకుంటున్నట్లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు తెలిపారు. అలాగే తెలంగాణలో 10 ఉమ్మడి జిల్లాల్లో పది కొత్త మైదానాలను నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. రీసెంట్‌గా ఈటీవీ భారత్‌కు జగన్ మోహన్ రావు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన కీలక విషయాలు వెల్లడిరచారు. ‘హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అనేది తెలంగాణ మొత్తానికి చెందినది. నాలుగు కోట్ల ప్రజలకు చెందినది. హైదరాబాద్‌లో ఒకే మైదానం ఉంది. జింఖానాలాంటి సదుపాయాలున్న స్టేడియాలను 10 ఉమ్మడి జిల్లాల్లో నిర్మించాలనుకుంటున్నాం. రాజీవ్ గాంధీ స్టేడియం సీటింగ్ కెపాసిటీ 37,000. నేను తెలంగాణ ప్రభుత్వాన్ని 100 ఎకరాలకు పైగా భూమిని ఇవ్వాలని అభ్యర్థించాను. అక్కడ 60,000-లక్ష మంది కూర్చునే సామర్థ్యం గల స్టేడియాన్ని నిర్మించాలనుకున్నాము’ ‘తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఇదే విషయంపై అభ్యర్థించాం. దీనికి సానుకూలంగా స్పందిస్తూ 150 ఎకరాలు ఇస్తామని ఆయన అసెంబ్లీలో ప్రకటించారు. మేము 100 ఎకరాలు అడిగితే, ప్రభుత్వం కొత్త స్టేడియం కోసం 150 ఎకరాలు ఇస్తామని చెప్పింది. అక్కడ 30- 40 మినీ స్టేడియాలు, కార్ పార్కింగ్?తో కూడిన పెద్ద మైదానాన్ని నిర్మిస్తాం. ఒకటి లేదా రెండేళ్లలో మేము ఆ ప్రక్రియను ప్రారంభిస్తాం’ అని జగన్? మోహన్ రావు తెలిపారు. బేగంపేట్ విమానాశ్రయానికి సమీపంలో 4,000- 5,000 ఎకరాల భూమితో కొత్త నగరాన్ని నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి నాకు చెప్పారు. అందులోనే క్రీడా సౌకర్యాలను ఏర్పాటు చేయాలనుకుంటున్నామని ఆయన అన్నారు.
గోల్ఫ్ అసోసియేషన్, ఇతర అసోసియేషన్లకు అక్కడే భూమి ఇస్తున్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్?కు కూడా అక్కడే 150 ఎకరాల భూమిని కేటాయిస్తారు. ఐపీఎల్?లో తెలంగాణకు చెందిన ఎక్కువ మంది ప్లేయర్లను ఫ్రాంచైజీలు తీసుకోలేదు. సిరాజ్, తిలక్ వర్మను మాత్రమే రెండు ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి. నేను చాలా ఐపీఎల్ ఫ్రాంచైజీలను మరికొంత మంది ఆటగాళ్లను తీసుకోవాలని అభ్యర్థించాను. కానీ, వారి అవసరాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటారు. మన ఆటగాళ్లను ఐపీఎల్?లో తీసుకోవట్లేదు. ముంబయి, కర్ణాటక, చెన్నై (తమిళనాడు) లీగ్‌ల్లో ఆడిన ప్లేయర్లను కొనుగోలు చేస్తున్నారు. అందుకే తెలంగాణ ప్రీమియర్ లీగ్ ప్రారంభిస్తున్నాం. ఐపీఎల్‌లో ఎంపికయ్యేందుకు ఆటగాళ్లకు ఈ లీగ్ బాగా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. ఐసీసీ ఛైర్మన్, బీసీసీఐ మాజీ కార్యదర్శి అనుమతి ఇచ్చేందుకు సహకరించారు. తెలంగాణ ప్రీమియర్ లీగ్ కు అనుమతి ఇచ్చినందుకు బీసీసీఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హేమాంగ్ అమీన్?కు ప్రత్యేక కృతజ్ఞతలు. ఐపీఎల్ ముగిసిన తర్వాత జూన్?లో తెలంగాణ ప్రీమియర్ లీగ్ ప్రారంభం కావొచ్చు. టీపీఎల్?ను మొదటి రెండేళ్లు 6-8 జట్లతో ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నాం. ఆ తర్వాత అవసరం అయితే 10 జట్లను ఏర్పాటు చేస్తాం. అపెక్స్ కౌన్సిల్, ఏజీఎంలతో సంప్రదించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటాం. కొత్త ప్రతిభను ప్రోత్సహించడానికే టీపీఎల్. కొత్త ఆటగాళ్లను తీసుకొని వారికి ఉప్పల్ స్టేడియం, మా అకాడమీలలో కోచింగ్ ఇవ్వాలనుకుంటున్నాం. రాజీవ్ గాంధీ స్టేడియంలో టీపీఎల్ అన్ని మ్యాచ్?లు జరుగుతాయి.