HMDA Plots Auction : 1000 ఎకరాలు 20 వేల కోట్లు..

HMDA is Planning to Sell Plots in Hyderabad

On
HMDA Plots Auction : 1000 ఎకరాలు 20 వేల కోట్లు..

1000 ఎకరాలు... 20 వేల కోట్లు..

హైదరాబాద్‌ - ప్రభాత  సూర్యుడు

హైదరాబాద్‌ నగరం, శివారు ప్రాంతాల్లోని ప్లాట్లను విక్రయించేందుకు హెచ్‌ఎండియే మరోసారి సిద్ధమవుతోంది. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయంలో కోకాపేట, మోకిలా, తొర్రూర్‌, బహదూర్‌పల్లి తదితర ప్రాంతాల్లో హెచ్‌ఎండీఏ భూములను ఆన్‌లైన్‌లో వేలం వేసింది. కోకాపేటలో రికార్డు స్థాయిలో ఎకరం రూ.100 కోట్లు ధర పలికింది. అయితే అప్పట్లో తొర్రూర్‌లో 117 ఎకరాల్లో 1000 ప్లాట్లతో హెచ్‌ఎండీఏ వెంచర్‌ వేసింది. అందులోని కొన్ని పాట్లు అమ్ముడుపోయాయి. బహదూర్‌పల్లిలో 40 ఎకరాల్లో 101 ప్లాట్లు, మోకిలలో 165 ఎకరాల్లో 1321 ప్లాట్లు వేలంలో అమ్ముడు పోయాయి. అవన్నీ కూడా భారీగా ధర పలికింది.

అయితే తొలి వాయిదా చెల్లింపు విషయంలో చాలామంది చేతులు ఎత్తేశారు. ప్రస్తుతం ఈ లేఅవుట్లలో 80 శాతం ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని గుర్తించి మరోసారి వేలం వేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.అయితే కోకాపేట తదితర ప్రాంతాల్లో భూములు రికార్డు ధర పలకటం వెనకు కుట్ర ఉందనే ఆరోపణలు వచ్చాయి. ప్రైవేటు భూములు ఉన్న కొందరు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ఉద్దేశపూర్వకంగా అక్కడ ధరలు పెంచేందుకు ఆన్‌లైన్‌లో అధిక ధరకు కోట్‌ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే.. ఆయా ప్రాంతాల్లోని భూములు, ప్లాట్ల ఆన్‌లైన్‌ వేలానికి సంబంధించి ప్రస్తుతం నిర్ణయం తీసుకోవడానికి హెచ్‌ఎండీఏ మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది.

రియల్‌ ఎస్టేట్‌పై మార్కెట్‌లో నెలకొన్న కొంత స్తబ్దత ప్రభావం వేలంపై పడే ఛాన్స్‌ ఉందని భావిస్తున్నారు.ప్రస్తుతం హెచ్‌ఎండీఏ పరిధిలోని పలు అభివృద్ధి పనులకు రూ.20 వేల కోట్ల వరకు అవసరమని అంచనా. హెచ్‌ఎండీఏ పరిధిలో దాదాపు 1000 ఎకరాలకు పైనే ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నాయి. కొన్ని లేఅవుట్లలో ప్లాట్లు విక్రయించగా.. అందులో కొన్నింటికి డబ్బులు చెల్లించకపోవడంతో కేటాయింపులు క్యాన్సిల్‌ అయ్యాయి. ఇలాంటి ప్లాట్లను ఇప్పటివరకు 500 వరకు గుర్తించగా.. వీటిని విక్రయించి రూ.1000 కోట్లు ఆర్జించాలని ఫ్లాన్‌ చేస్తోంది. ఇప్పుడిప్పుడే రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ పుంజుకుంటుండగా.. పూర్తిస్థాయిలో ఊపు వచ్చిన తర్వాత వేలం వేస్తే మంచి డిమాండ్‌ ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. త్వరలోనే వేలంపై నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు.

Views: 7

Latest News