Vanajeevi Ramaiah : వన జీవి పద్మశ్రీ రామయ్య కన్నుమూత

పద్మశ్రీ వనజీవి రామయ్య మృతి పట్ల ఇరు రాష్ట్రాల సియంలు సంతాపం

On
Vanajeevi Ramaiah : వన జీవి పద్మశ్రీ రామయ్య కన్నుమూత

పద్మశ్రీ అవార్డు గ్రహీత వృక్ష ప్రేమికుడు దరిపెల్లి రామయ్య (వనజీవి రామయ్య) ఫైల్ ఫోటో

వనజీవి పద్మశ్రీ రామయ్య కన్నుమూత

ఖమ్మం - ప్రభాత సూర్యుడు

పద్మశ్రీ అవార్డు గ్రహీత వృక్ష ప్రేమికుడు దరిపెల్లి రామయ్య (వనజీవి రామయ్య) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.  కోటి మొక్కలు నాటి ప్రకృతి ప్రేమికుడిగా పేరు గాంచిన ఆయనను 2017లో కేంద్రం పద్మశ్రీతో సత్కరించింది. రామయ్య స్వస్థలం ఖమ్మం రూరల్‌ మండలం రెడ్డిపల్లి.DaripalliRamaiah

పద్మశ్రీ వనజీవి రామయ్య మృతి పట్ల ఇరు రాష్ట్రాల సియంలు సంతాపం

పద్మశ్రీ వనజీవి రామయ్య మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..ప్రకృతి పర్యావరణం లేనిదే  మానవ మనుగడ లేదనే సిద్ధాంతాన్ని బలంగా నమ్మిన వ్యక్తి వన జీవిగా పేరుగాంచిన దరిపల్లి రామయ్య అని. ఒక వ్యక్తిగా మొక్కలు నాటడం ప్రారంభించి మొత్తం సమాజాన్ని ప్రభావితం చేసిన వ్యక్తి పద్మశ్రీ రామయ్య గారని అన్నారు. వారు సూచించిన మార్గం నేటి యువతకు ఆదర్శంమని పేర్కొన్నారు. పర్యావరణ రక్షణకు పాటుపడుతూ తన జీవితాన్ని అంకితం చేసిన రామయ్య గారి ఆత్మకు నివాళులు అర్పించారు. వారి మరణం సమాజానికి తీరని లోటు, కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతిని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.399422-telugu-state-cms-deeply-shocked-over-vanajeevi-ramaiahs-death

పద్మశ్రీని వనజీవి రామయ్య మరణం పట్ల సీఎం చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పర్యావరణ పరిరక్షణకు కోటి మొక్కలు నాటిన రామయ్య కృషి స్ఫూర్తిదాయకమని అన్నారు. ఆయన మరణం పర్యావరణ పరిరక్షణ ఉద్యమానికి తీరని లోటని పేర్కొన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వనజీవి మరణం బాధకరమని మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు. ఆయన చూపించిన మార్గం ఎన్నో తరాలకు ప్రేరణగా నిలుస్తుందన్నారు.

Views: 40

Latest News