AP HEALTH ALRET 2025 : ఫారం కోళ్లకు అంతు చిక్కని వ్యాధి
Chickens are dying in heaps - is the migration of birds the cause of the spread of the virus?
ఫారం కోళ్లకు అంతు చిక్కని వ్యాధి
కుప్పలుగా పోతున్న కోళ్లు ప్రాణాలు - పక్షులు సంచారమే వైరస్ వ్యాప్తి కి కారణమా..
ఏలూరు - ప్రభాత సూర్యుడు
ఏలూరు ...ఉమ్మడి పశ్చిమ లో పౌల్ట్రీ రంగం అల్లాడి పోతుంది. కోళ్లు మ్రృత్యువాత తో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అసలు వీటి మరణాలకు కారణమేంటో తెలుసుకునేందుకు పశుసంవర్ధన శాఖ అధికారులు రంగంలోకి దిగారు. శాంపిల్స్ సేకరించి భోపాల్ లోని హై సెక్యూరిటీ ల్యాబ్ కు పంపారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోనీ పౌల్ట్రీ ఫారాలలో అంతుచిక్కని వైరస్ బారిన పడి లక్షలాది కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. గడిచిన 15 రోజుల్లో 40 లక్షల కోళ్లు చనిపోయాయి అంటేనే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందనే విషయం మనకు అర్థమవుతుంది. కోళ్ల మరణాలకు కారణమైన వైరస్ ను గుర్తించి దాని నిర్మూలనకు సహకరించాలని పలువురు రైతులు అధికారులను కోరుతున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పౌల్ట్రీ ఫారాలు వద్ద గుట్టలు గుట్టలుగా మృతి చెందిన కోళ్లు దర్శనమిస్తున్నాయి.. ఒక్కొక్క పౌల్ట్రీ ఫారం వద్ద సుమారు రోజుకు పదివేల కోళ్లు మృతి చెందుతున్నాయి.. కోళ్ల మృతికి కారణాలు ఇప్పటివరకు పౌల్ట్రీ ఫారాల యజమానులు గుర్తించలేకపోతున్నారు. సుమారు జిల్లాలో 40 లక్షల కోళ్ళు మృతి చెందినట్లు రైతులు చెబుతున్నారు. కోళ్ల మృతితో ఒక్కసారిగా కోడిగుడ్డు ఎగుమతులు భారీగా తగ్గిపోయాయి.. ఉత్తరాది రాష్ట్రాలైన పశ్చిమబెంగాల్, అస్సాం, గౌహతి ప్రాంతాలకు ప్రతినిత్యం జిల్లా నుంచి సుమారు 40 కి లారీలలో కోడిగుడ్లు ఎగుమతి అయ్యేది. ఆ సంఖ్య 25 కు పడిపోయింది.. మరికొన్ని రోజులు పరిస్థితి ఇలాగే గనుక ఉంటే ఆ సంఖ్య సింగిల్ డిజిట్ కు పడిపోతుందని ఎక్స్పోర్టర్స్ ఆందోళన చెందుతున్నారు.. కోళ్లు మృతి చెందడానికి కారణాలు తెలుసుకొనే పనిలో పడ్డారు అధికారులు. ఫోల్ట్రీలో కోళ్లు వైరస్ బారిన పడి చనిపోతున్నాయని న్యూస్ వైరల్ అవుతుందని, హాస్పిటల్ నుంచి గాని, వెటర్నరీ డాక్టర్ నుంచి గాని కోళ్లు మృతిపై మాకు ఫిర్యాదు రాలేదనీ యానిమల్ హస్బెండరి అసిస్టెంట్ డైరెక్టర్ సుచరిత అంటున్నారు. వాళ్ల మృతిపై పౌల్ట్రీ ఫార్మర్స్ 2 రోజుల క్రితం రిప్రజెంటేషన్ ఇచ్చారనీ, కోళ్లు చనిపోతున్న పౌల్ట్రీ ఫార్మ్స్ లో శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కి పంపామని,బాదంపూడి రేలంగి మొగల్లు పెద్ద తాడేపల్లి , దువ్వ వేల్పూర్ తణుకు, గుమ్మనిపాడు ప్రాంతాలలో కోళ్లు ఎక్కువుగా చనిపోతున్నాయనీ, ల్యాబ్ రిపోర్ట్ అనంతరం వ్యాధి ఏంటి అనేది నిర్దారిస్తామ్మనారు సుచరిత. హైపాతోజనిక్ అవేయిన్ ఇన్ఫ్లుఎంజా స్ట్రెయిన్ (H5N1) అనే వైరస్ సోకి కోళ్లు మృతి చెందుతున్నట్లు పశు సంవర్ధక శాఖ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు